/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-18-jpg.webp)
Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం 'పుష్ప 2' (Pushpa 2) చిత్రీకరణలో బిజీగా ఉంది. పుష్ప పార్ట్ 1 తరువాత పాన్ ఇండియా స్థాయిలో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. రీసెంట్ గా సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' మూవీ సక్సెస్ తో మరో సారి ట్రెండ్ అయ్యింది.
అయితే తాజాగా నేషనల్ క్రష్ రష్మికకు.. టోక్యోలోని 'క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ లో' పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చింది. టాలీవుడ్ నుంచి ఈ గౌరవం దక్కిన ఏకైక నటిగా రష్మిక రికార్డు క్రియేట్ చేసింది. గ్లోబల్ ఈవెంట్ గా జరుగుతున్న ఈ అవార్డు వేడుకల్లో భారత్ ను రిప్రజెంట్ చేస్తోంది ఈ బ్యూటీ.
టోక్యో ఎయిర్ పోర్ట్ లో రష్మికను సర్ప్రైజ్ చేసిన జపాన్ ఫ్యాన్స్
ఈ సందర్భంగా జపాన్ వెళ్లిన రష్మికకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు అక్కడి ఫ్యాన్స్. టోక్యో ఎయిర్ పోర్ట్ లో రష్మిక కోసం గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేశారు. ఆమె ఫొటోలతో డిజైన్ చేసిన ప్లకార్డ్స్ చూపిస్తూ రష్మికను ఆహ్వానించారు. ఎయిర్ పోర్ట్ లో తన అభిమానులు ఇచ్చిన వెల్కమ్ చూసి ఆశ్చర్యపోయింది రష్మిక. వారందరికీ హాయ్ చెబుతూ.. సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
National crush @iamRashmika was warmly welcomed by her fans in Tokyo❤️#RashmikaMandanna #Pushpa2TheRule pic.twitter.com/lFWbaQLpvm
— Suresh PRO (@SureshPRO_) March 1, 2024
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్