Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికే ఆయన సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. వాటిలో ఒకటి ‘హరహర వీరమల్లు’. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరహర వీరమల్లు’. 2020లోనే మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. ఇప్పటికీ కేవలం 50 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ పై అనేక రూమర్స్ వస్తున్నాయి. సినిమా అవుట్ పుట్ పై పవన్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే మూవీని పక్కన పెట్టేశారనే వార్తలు తెగ వైరలయ్యాయి. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సినిమా నిజంగానే ఆగిపోయిందని భావించారు ఆడియన్స్.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Translate this News: