రష్మిక డీప్‌ఫేక్ వీడియో ఫస్ట్ అప్ లోడ్ చేసింది ఇతడే.. వెల్లడించిన ఢిల్లీ పోలీసులు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు వేగం పెంచారు. బీహార్‌కు చెందిన 19 ఏళ్ల యువకుడి ఖాతా నుంచే ఈ వీడియో అప్‌లోడ్ అయినట్లు గుర్తించి అతనికి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. By srinivas 15 Nov 2023 in సినిమా క్రైం New Update షేర్ చేయండి స్టార్ నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో కేసులో కీలకమైన విషయాలు వెల్లడించారు ఢిల్లీ పోలీసులు. ఇటీవల సంచలనం రేపిన ఈ కేసులో భాగంగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. ఈ మేరకు బీహార్‌కు చెందిన 19 ఏళ్ల అబ్బాయి ముందుగా ఈ వీడియోను తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా అతని ఖాతా నుంచే ఈ వీడియో అప్‌లోడ్ అయినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ మేరకు సదరు యువకుడికి నోటీసులు జారీ చేశారు. మరోవైపు విచారణ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆ వీడియోను మొదట డౌన్‌లోడ్ చేసుకున్నట్లు యువకుడు వెల్లడించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని, త్వరలోనే ఇందుకు సబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అలాగే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదని, ఈ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు పోలీసులు. Also read : ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు ఇక జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వీడియోకు రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి నెట్టింట దీన్ని పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. దీంతో కేంద్ర ఐటీ శాఖ కూడా ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో మార్ఫింగ్ వీడియోపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. ఆ వీడియో ఏ అకౌంట్ నుంచి తొలుత అప్‌లోడ్ అయ్యిందో అందుకు సంబంధించిన యూఆర్‌ఎల్ వివరాలను అందించాలంటూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా (Meta)ను కోరారు. అదేవిధంగా నకిలీ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారి వివరాలను కూడా అందించాలని కోరుతూ మెటా సంస్థకు ఢిల్లీ పోలీసులు లేఖ రాసినట్లు తెలిపారు. అలాగే దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. నెటిజన్లు, రష్మిక అభిమానులే కాదు పలువురు స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమితాబ్ బచ్చన్, విజయ్ దేవరకొండ , నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్, మృణాల్ ఠాకూర్, కీర్తి సురేశ్ వంటి సినీ నటులతోపాటు ప్రముఖులు రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. #rashmika #delhi-police #deepfake-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి