Rashmi Gautam : అలాంటి వీడియోలు వెయ్యి షేర్ చేస్తా.. పిల్లల్ని కనడమే కాదు బాధ్యత కూడా ఉండాలి, వైరలవుతున్న రష్మీ ట్వీట్!

తాండూరులో చిన్నారిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన ఘటనపై రష్మి రియాక్ట్ అవుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కుక్క దాడి చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ నిద్రపోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి అంటూ ట్వీట్ లో తెలిపింది.

New Update
Rashmi Gautam : అలాంటి వీడియోలు వెయ్యి షేర్ చేస్తా.. పిల్లల్ని కనడమే కాదు బాధ్యత కూడా ఉండాలి, వైరలవుతున్న రష్మీ ట్వీట్!

Rashmi Gautam Reacts To Netizen's Tweet : బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియా లో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు ట్రోల్స్ కి కూడా గురవుతుంటుంది. అయినా వాటికీ ఏమాత్రం భయపడకుండా తనదైన స్టైల్ లో కౌంటర్ అటాక్ చేస్తుంది.

కాగా రష్మి యానిమల్ లవర్ అనే విషయం అందరికీ తెలుసు. మూగ జీవాలను హింసించే వారిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతుంది.ఇదిలా ఉంటే రీసెంట్ గా తాండూరులో చిన్నారిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసిన విషయం తెలిసిందే కదా! అయితే ఇదే ఘటనపై రష్మి రియాక్ట్ అవుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : హాస్పిటల్‌ పాలైన బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌.. ఏమైందంటే!

తాండూరులో పెంపుడు కుక్క దాడిలో ఘటనలో ఐదు నెలల చిన్నారి మృతి చెందింది. అయితే ఆ కుక్కను చిన్నారి తల్లిదండ్రులు కొట్టి చంపేశారు. ఆ తల్లిదండ్రులు కక్కాడు కొట్టి చంపడాన్ని రష్మి తప్పు పట్టింది. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ చిన్నారి పేరెంట్స్ పై కేస్ పెట్టాలని రష్మి చెబుతుందంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ రష్మి సైతం రిప్లై ఇచ్చింది.

పిల్లల జీవితాల్ని రిస్క్ లో పెట్టింది ఎవరు?

రష్మి తన ట్వీట్ లో .." ఆ చిన్నారిని ఎందుకలా ఒంటరిగా వదిలేసారు? కుక్క దాడి చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ నిద్రపోతున్నారా? కనీసం ఆ చిన్నారి ఏడుపు కూడా వినిపించలేదా? జంతువులపై ఇలాంటి ప్రచారాన్ని ఆపండి. తెలివి తక్కువగా వ్యవహరించే తల్లిదండ్రులకు సంబంధించి వెయ్యి వీడియోలను షేర్‌ చేయగలను. అసలు పిల్లల జీవితాలను రిస్క్‌లో పెట్టింది ఎవరు? జంతువుల విషయానికొస్తే అన్నీ లాజిక్స్‌ మర్చిపోతారు. ఈ ప్రపంచాన్ని ఇబ్బందులకు గురి చేసి.. మీరు మాత్రం ప్రశాంతతను పొందాలనుకుంటే అది జరిగే పని కాదు" అంటూ రాసుకొచ్చింది.

మీకు బుర్ర లేదని అర్థమైంది

రష్మి ట్వీట్ కి మరో నెటిజన్ స్పందిస్తూ.." మీకు బుర్ర లేదని అర్థమైందండి.. ఈ మాట అంటున్నందుకు సారీ' అని రాసుకొచ్చాడు. దీనికి రష్మి బదులిస్తూ..'మీకు బుర్ర ఉంది కదా.. పిల్లలను కనడం మాత్రమే కాదు. వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. దయచేసి పెంపుడు జంతువులు ఉన్నవాళ్లు పిల్లలను అలా వదిలేయకండి' అని పేర్కొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు