Rakhi Sawant : హాస్పిటల్‌ పాలైన బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌.. ఏమైందంటే!

బాలీవుడ్ భామ ..తన కామెడీతో అందర్ని నవ్విస్తూ , ఏదోక వివాదంలో నిలుస్తూ ఉండే రాఖీ సావంత్‌ కి సంబంధించిన ఓ బ్యాడ్‌ న్యూస్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.రాఖీ అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.ఆమె తీవ్రమైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు కూడా మీడియా లో కథనాలు వస్తున్నాయి.

New Update
Rakhi Sawant : హాస్పిటల్‌ పాలైన బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌.. ఏమైందంటే!

Bollywood Actress : బాలీవుడ్ భామ ..తన కామెడీతో అందర్ని నవ్విస్తూ , ఏదోక వివాదంలో నిలుస్తూ ఉండే రాఖీ సావంత్‌(Rakhi Sawant) కి సంబంధించిన ఓ బ్యాడ్‌ న్యూస్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. టీవీ నటి – రియాలిటీ షో ‘బిగ్ బాస్’(Bigg Boss) కంటెస్టెంట్ అయిన రాఖీ అత్యవసరంగా ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. ఆమె తీవ్రమైన గుండె జబ్బు(Heart Disease)తో బాధపడుతున్నట్లు కూడా మీడియా లో కథనాలు వస్తున్నాయి. అయితే ఈ వార్త అభిమానులను షాక్‌కి గురి చేసింది.

ఆమె ఆరోగ్యం కోసం అందరూ ప్రార్థిస్తున్నారు. రాఖీ సావంత్‌ ఆసుపత్రిలో ఉన్న కొన్ని ఫొటోలు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. వాటిలో రాఖీ మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉంది. ఒక వేలికి ఆక్సిమీటర్, మరొక చేతికి వైగో జోడించి ఉంది. ఆ కారణంగా ఆమెకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. ఇక ఒక పిక్ లో నర్సు ఆమెకు BP (రక్తపోటు) తనిఖీ చేస్తోంది. ఈ ఫొటోలు చూసిన వారంతా రాఖీ ఆరోగ్యం కోసం ఆరాట పడుతున్నారు. రాఖీకి గుండె సంబంధిత సమస్య ఉందని, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారని తెలుస్తుంది.

Also read: ముంబై హోర్డింగ్‌ ప్రమాదంలో వెలుగులోకి దారుణ విషయాలు!

Advertisment
Advertisment