Delhi : ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటన.. స్పందించిన రావుస్ అకాడమీ ఢిల్లీలో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందిన ఘటనపై తొలిసారిగా రావుస్ ఐఏఎస్ అకాడమీ స్పందించింది. మృతులకు నివాళులర్పిస్తూ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. మా విద్యార్థులను కోల్పోవడం బాధాకరమని.. వారి కలలు, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపింది. By B Aravind 31 Jul 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Rau's IAS Coaching Center : ఢిల్లీ (Delhi) లోని రావుస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిదే. కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల బేస్‌మెంట్‌లోకి వరద (Flood) రావడంతో ముగ్గురు సివిల్స్ విద్యార్థులు మృతి చెందారు. అయితే ఈ ఘటనపై తొలిసారిగా రావుస్ అకాడమీ (Rau's Academy) స్పందించింది. మృతులకు నివాళులర్పిస్తూ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. మా విద్యార్థులను కోల్పోవడం బాధాకరమని.. వారి కలలు, అంకితభావం ఎప్పటికీ గుర్తుండిపోతాయని తెలిపింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. అలాగే ఈ ఘటనపై జరుగుతున్న విచారణకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది. Also Read: రూపాయికి 500 రూపాయలు ఇచ్చే దేశం ఏదో తెలుసా? ఇదిలాఉండగా.. ఈ ఘటనలో ఎస్‌యూవీ డ్రైవర్ మను కతురియా, భవన యజమానులు పర్వీందర్ సింగ్, సర్వజిత్ సింగ్, హర్విందర్ సింగ్, తేజేందర్ సింగ్‌లు అరెస్టు అయ్యారు. వీళ్లు కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. దీనికి న్యాయస్థానం నిరాకరించింది. కతురియా తన అరెస్టుని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌పై రేపు కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు కతురియా భార్య సీమా కతురియా ఈ ఘటనలో తన భర్త తప్పులేదని వాదిస్తోంది. ఇది పూర్తిగా కోచింగ్ సెంటర్ నిర్లక్ష్యమేనని ఆరోపిస్తున్నారు. #telugu-news #delhi #raos-ias-study-circle #civils-students మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి