Bold care: పోర్న్ స్టార్ తో రణ్ వీర్.. శృంగారం ఇలా ఆస్వాదించాలంటూ వీడియో

బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ అడల్ట్ యాడ్ లో నటించి వార్తల్లో నిలిచారు. ప్రముఖ పోర్న్ స్టార్ జానీ సిన్స్‌తో కలిసి పురుషుల్లో శృంగార సమస్యలను తొలగించేందుకు 'బోల్డ్ కేర్' అనే కాప్స్యూల్‌ వాడాలంటూ ప్రచారం చేసే ప్రకటనలో కనిపించాడు. వీడియో వైరల్ అవుతుండగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

New Update
Bold care: పోర్న్ స్టార్ తో రణ్ వీర్.. శృంగారం ఇలా ఆస్వాదించాలంటూ వీడియో

Ranveer singh: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. సినీ సెలబ్రిటీలు, ప్రముఖ వ్యాపార ప్రకటనలకు సంబంధించిన ఈవెంట్స్ లో ఫుల్ జోష్ గా కనిపిస్తూ అందరినీ అలరించే రణ్ వీర్.. సోషల్ మీడియాలోనూ మస్తు మజా చేస్తుంటాడు.

పోర్న్ స్టార్ తో..
అలాగే ఈయన భార్య, నటి దీపికా పడుకొణె సైతం పలు కార్పొరేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటూ వాణిజ్య ప్రకటనల ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా శృంగార సామార్థ్యానికి సంబంధించిన ఓ యాడ్ లో పోర్న్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచాడు రణ్ వీర్.

ఇది కూడా చదవండి :Kiss day: ఫస్ట్ లాంగెస్ట్ ఆన్-స్క్రీన్ ముద్దు వీళ్లదే.. అతనితో లేచిపోయి ట్విస్ట్ ఇచ్చిన నటి

'బోల్డ్ కేర్'..
ఈ మేరకు అడల్ట్ ఫిల్మ్ స్టార్ జానీ సిన్స్‌తో కలిసి ఓ యాడ్‌లో నటించాడు. పురుషుల్లో శృంగార సమస్యలను తొలగించేందుకు 'బోల్డ్ కేర్' (Bold care) అనే కాప్స్యూల్‌ను ప్రచారం చేసే ప్రకటనలో కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్, నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై స్పందించిన రష్మీ దేశాయ్.. 'అన్ని టీవీ పరిశ్రమలు, టెలివిజన్‌లో పనిచేసే వ్యక్తులకు ఇది అవమానంగా భావిస్తున్నా. ఈ ప్రకటన ఒక చెంపదెబ్బలా అనిపిస్తోంది' అని మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు