/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/ranveer-deepika-jpg.webp)
Ranveer Singh Deepika Announces Pregnancy: బాలీవుడ్ నటి దీపికా పదుకొన్ ఫ్యాన్స్‌కు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. దీపికా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తాను ప్రెగ్నెంట్‌నని దీపికా పోస్ట్ చేసింది. త్వరలో తల్లి కాబోతున్నానని, రణవీర్ సింగ్ తండ్రి అవుతాడని చెప్పింది. ఈ పోస్ట్ చూసిన ఈ బాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. రణవీర్-దీపికకు ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు.
View this post on Instagram
ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో మరో విషయాన్ని క్లారిటీ ఇచ్చింది దీపికా (Deepika Padukone). తమ బిడ్డ ఎప్పుడు జన్మనిస్తుందో కూడా చెప్పింది. ఆమె షేర్ చేసిన పోస్ట్ ప్రకారం సెప్టెంబర్‌లో రణవీర్-దీపిక తల్లిదండ్రులు అవుతారు. ప్రస్తుతం ఇద్దరూ పేరెంట్‌హుడ్‌కు సిద్ధమవుతున్నారు. పోస్ట్‌లోని ఫొటోలో పిల్లల బట్టలు, బొమ్మలు, బూట్లు కనిపిస్తున్నాయి. ఆ ఫొటోపై సెప్టెంబర్ 2024 అని రాసి ఉంది. ఈ పోస్ట్ క్యాప్షన్ మధ్యలో ఉన్న ఎమోజిని చూస్తే దీపిక ప్రెగ్నెంట్ అని, త్వరలో తల్లి కానుందని క్లారిటీ వచ్చింది.
దీపికా పదుకొన్, రణ్‌వీర్‌సింగ్‌ల (Ranveer Singh) జంట సినీ ప్రపంచంలోని ప్రముఖ జంటలలో ఒకటి. ఈ కపుల్‌ను 'దీప్‌వీర్' అని పిలుస్తారు. 2018 నవంబర్ 18న వీరిద్దరు పవిత్ర బంధంలో అడుగుపెట్టారు. ఈ జంట ఒకటి కాదు రెండు సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. దీపికా పదుకొన్, రణ్‌వీర్ సింగ్ ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా డెల్ బాల్బియానెల్లోలో ఏడు సముద్రాల ఆవల సంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. నవంబర్ 14, 2018లో ఈ జంట కొంకణి స్టైల్‌లో వివాహం చేసుకున్నారు. పెళ్లికుతురిగా తన తల్లి ఇచ్చిన కంజీవరం చీరను ధరించింది దీపిక. నవంబర్ 15,2018లో దీపికా-రణవీర్ సింధీ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. అందులో ఆమె సబ్యసాచి డిజైన్ చేసిన లెహెంగాను ధరించింది.
Also Read: పవన్ నా అవసరం లేదా..? జనసేనానికి ముద్రగడ లేఖ!
WATCH Ranveer Deepika Wedding Trailer: