Ranbir Kapoor: అందుకోసం రణబీర్ కపూర్ షాకింగ్ నిర్ణయం..!!

రామాయణం సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాముడి పాత్ర పోషించనున్న రణబీర్ అందుకోసం మద్యానికి దూరం ఉండాలని నిర్ణయం తీసుకున్నారట!. రాముడి మాదిరిగా స్వచ్ఛంగా ఉండాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Ranbir Kapoor: అందుకోసం రణబీర్ కపూర్ షాకింగ్ నిర్ణయం..!!
New Update

Ranbir Kapoor: రామాయణం సినిమా కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్(Ranbir Kapoor) సంచలన నిర్ణయం తీసుకున్నారు.  రాముడి పాత్ర పోషించనున్న రణబీర్ అందుకోసం మద్యానికి దూరం ఉండాలని నిర్ణయం తీసుకున్నారట!. రాముడి మాదిరిగా స్వచ్ఛంగా ఉండాలనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా ‘రామాయణం’. ఈ మూవీలో రాముడి పాత్రను రణబీర్ పోషించనున్నారు.

publive-image

అందుకోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ మద్యం, మాంసానికి దూరంగా ఉండనున్నారు. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నందున, పవిత్రంగా ఉండాలనే ఆలోచనతో రణబీర్ కపూర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు  టాక్ వినిపిస్తోంది. ప్రజల్లో పరపతి కోసం రణబీర్ కపూర్ మద్యం, మాంసానికి దూరంగా ఉండడం లేదని, కేవలం రాముడి పాత్ర కోసమే ఆ పని చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై  ఇంకా ఆయన అధికారిక ప్రకటన చేయలేదు.

publive-image

ఈ సినిమాలో రణబీర్ కపూర్ సరసన దక్షిణాది నటి సాయి పల్లవి(sai pallavi) నటించనుంది. రామాయణం సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదిలో మొదలు కానుంది. ఫిబ్రవరి నుంచి రణబీర్, సాయి పల్లవితో కూడిన షాట్లు తీయనున్నట్టు తెలుస్తోంది. ఆగస్ట్ వరకు ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుంది. వీఎఫ్ఎక్స్ సేవలను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న కంపెనీ డీఎన్ఈజీ అందించనున్నట్టు తెలుస్తోంది.

publive-image

బాలీవుడ్‌  రణబీర్ కపూర్ సరసన ఫిదా బ్యూటీ  సాయి పల్లవి నటిస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అందంతో పాటు అసలైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది సాయి పల్లవి. మేకప్ లేకుండా క్యూట్‌గా కనిపిస్తున్న సాయి పల్లవి.. నటి అంటే ఇలా ఉండాలి అనే హద్దులు బద్దలు కొట్టింది. ఫిదా సినిమాలో మేకప్ లేకుండా చాలా సహజంగా కనిపించింది. ఆమె క్యూట్ ఫేస్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.

Also Read: ఇక ఆపండి.. ఇంకెంత ఏడిపిస్తారు..!!

#sai-pallavi #ramayanam-movie #ranbeer-kapoor
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe