Ranbir Kapoor about Kohli Biopic: ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు, ఆటగాళ్లు, తదితర ప్రముఖుల జీవిత కథలను తెరకెక్కిస్తూ దర్శకనిర్మాతలు మంచి బిజినెస్ చేసుకుంటున్నారు. 2015లో దివంగత హీరో సుశాంత్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ధోనీ’ (Dhoni) బయోపిక్ మంచి వసూళ్లు రాబట్టింది. అలాగే ఇటీవలే శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథగా వచ్చిన ‘800’పాజిటీవ్ టాక్ అందుకుని పర్వాలేదనింపించింది. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీ (Virat Kohli) బయోపిక్ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) కోహ్లీ పాత్ర పోషించబోతున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో రీసెంట్ ఇంటర్వ్యూలో స్పందించిన రణ్ బీర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
పూర్తిగా చదవండి..Ranbir Kapoor: కోహ్లీ బయోపిక్ పై స్పందించిన రణ్ బీర్.. ఏమన్నాడంటే
విరాట్ కోహ్లీ బయోపిక్ లో నటించడంపై రణ్ బీర్ కపూర్ స్పందించారు. ఆయన జీవితాన్ని సినిమాగా తీస్తే.. అందులో కోహ్లీనే నటించాలన్నారు. ఎందుకంటే అతడు చాలామంది నటుల కంటే అందంగా కనిపిస్తాడు. అలాగే ఫిట్‌గా కూడా ఉంటాడు. అందుకే ఆ పాత్రను కోహ్లీనే పోషించాలని చెప్పారు.
Translate this News: