Ranbeer Kapoor: రహా కపూర్‌ డాటర్‌ ఆఫ్‌ అలియా రణబీర్‌ కపూర్‌..మొదటి సారి మీడియా ముందుకు!

బాలీవుడ్‌ అందాల జంట రణబీర్‌ కపూర్‌, అలియా భట్‌ మొదటి సారి తమ కుమార్తె ముఖాన్ని మీడియాకి , అభిమానులకు చూపించారు. ఏడాదిన్నర తరువాత వారు పాప ముఖాన్ని చూపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాప కి ముత్తాత పోలికలు వచ్చాయంటూ సంబరపడుతున్నారు.

New Update
Ranbeer Kapoor: రహా కపూర్‌ డాటర్‌ ఆఫ్‌ అలియా రణబీర్‌ కపూర్‌..మొదటి సారి మీడియా ముందుకు!

బాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటీఫుల్‌ అలియా భట్‌ (Aliyabhat) , రణబీర్‌ కపూర్‌ (Ranabeer Kapoor)  గతేడాది పెళ్లి చేసుకుని అదే ఏడాది తల్లిదండ్రులు కూడా అయిపోయారు. వారికి పుట్టిన పాప రహా కపూర్‌ (Raha Kapoor)  ని ఇప్పటి వరకు బయటకు చూపించని ఈ జంట తాజాగా క్రిస్టమస్‌ సెలబ్రేషన్స్‌ లో పాప ఫేస్‌ ని మీడియాకి, అభిమానులకు చూపించారు.

పాప పుట్టిన ఇన్ని రోజుల తరువాత బయట ప్రపంచానికి చూపించడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాప రహా కి సంబంధించిన ఫోటోలు , వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే రహా పాపను చూసిన వారంతా కూడా ఆమె కళ్ల మీదే దృష్టి పెట్టారు.

ఎందుకంటే రహా కళ్లు నీలి కళ్లు..రణబీర్‌ ఫ్యామిలీలో అలాంటి కళ్లు రాజ్‌ కపూర్‌ (Raj Kapoor) కి అలానే ఉండేవని చెబుతున్నారు. రణబీర్‌ బాలీవుడ్‌ అగ్ర నటుడు రాజ్‌ కపూర్‌ కి మనవడు అనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు రహాకి నీలి కళ్లు రావడంతో ముత్తాత పోలీకలు వచ్చాయంటూ తెగ సంబరపడిపోతున్నారు.

ఇప్పుడు బ్లూ ఐస్‌ తో క్యూట్ గా కనిపిస్తున్న రహా ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద సెలబ్రిటీ అయిపోయింది. రహా పింక్‌, వైట్‌ కాంబినేషన్‌ డ్రెస్‌ వేసుకోగా..ఆమెను రణబీర్‌ , అలియా ఎత్తుకొని ఫోటోలకు పోజులు ఇచ్చారు. అలియా క్రిస్మస్‌ థీమ్‌ డ్రెస్‌ లో కనిపించారు. క్రిస్మస్‌ హెడ్‌ బ్యాండ్‌ ను కూడా పెట్టుకుని క్యూట్‌ గా కనిపించారు. బ్లాక్ ఔట్‍ఫిట్‍లో రణ్‍బీర్ కపూర్ స్టైలిష్‍గా కనిపించారు.

రహా పుట్టిన తరువాత ఆమె ముఖాన్ని ప్రపంచానికి చూపించడానికి అలియా దంపతులు ఇష్టపడలేదు. ఈ విషయం గురించి పలు ఇంటర్వ్యూల్లో అలియా దంపతులను అడగగా..తాము కొత్తగా తల్లిదండ్రులయ్యామని, ఇంటర్నెట్‌ లో రహా ఫోటోలు తిరుగుతుంటే తమకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అర్థం కాక ముఖం చూపించడం లేదని ఆమె అన్నారు. అయితే, ఎట్టకేలకు ఇప్పుడు రహా ముఖాన్ని ప్రపంచానికి చూపించారు.

ఇక రణబీర్‌ విషయానికి వస్తే..రీసెంట్‌ గా యానిమల్‌ సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగ తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటివరకు 860 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.

Also read: కొత్త రేషన్ కార్డులకు అప్లికేషన్లు ఆ రోజు నుంచే.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!

Advertisment
తాజా కథనాలు