/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rana-1-jpg.webp)
సౌత్ ఇండస్ట్రీలో రానా దగ్గుబాటి ఆల్ రౌండర్ హీరో.. నిర్మాత.. హోస్ట్.. సమర్పకుడు...ఇలా ఆల్ రౌండర్‌గా ఉంటున్న రానా, ప్రభాస్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. బాహుబలి సినిమా తర్వాత వీరిద్దరి మధ్యా ఫ్రెండ్‌షిప్ మరింత పెరిగిందనే చెప్పాలి. బాహుబలి లాంటి భారీ ఫ్రాంఛైజీలో భల్లాలదేవ పాత్రలో ప్రభాస్ కి సమానంగా నటించి మెప్పించాడు రానా. ఆ తురవాత కూడా రానా వరుపగా సినిమాలను చేస్తూ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం అతను ప్రభాస్‌ని చూసి చాలా కళ్ళుపోతున్నాడుట. ఈ విషయాన్ని రానానే స్వయంగా క్ష ఇంటర్వూలో చెప్పాడు. ఫిలిం కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టేశాడు.
కల్కి సెట్స్‌కి వెళ్ళినప్పుడు ఒకరిని చూసి నేను మొదటిసారి అసూయపడ్డాను. యువకుడిగా ఎదిగే క్రమంలో నాకు విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు అంటే ప్రాణం. స్టార్ వార్స్ నా ఫేవరెట్ మూవీ. చాలా తక్కువ మందికి ఇలాంటివి నచ్చుతాయి. కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా అదే జానర్ అంటే ఇష్టం. అందుకే అతను కల్కి మూవీని సైంటిఫిక్ జానర్ గా తీస్తున్నాడు అని చెప్పాడు రానా.
Also Read:చిన్నారులను చిదిమేస్తున్న యుద్ధం – హృదయ విదారకంగా గాజా
నేను కల్కి సెట్‌లోకి వెళ్లినప్పుడు ప్రభాస్ ఉన్నాడు.నేను కలలుగన్న ప్రతిదాన్ని అతడు చేస్తున్నాడు. నా కళ్ళతో దాన్ని నేను చూవాను. నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు నేను ప్రభాస్‌తో మాట్లాడలేదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోయాను కూడా. ఆ తరువాత నేను అతడిని పిలిచి నాకు నిజంగా అసూయగా ఉంది.. నాకు ఎందుకో తెలియదు అని చెప్పానన్నాడు రానా.కల్కి సినిమా పురాణేతిహాసాల నుండి సైన్స్ ఫిక్షన్ జోడించిన కథ. దీని గురించి నేను చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నానని చెప్పుకొచ్చాడు.
నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్ కీలక పాత్రలు పోషిస్తుండగా.. లోక నాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడిగాచేస్తున్నారు. ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారం సాగిన కల్కి సినిమా టైటిల్ గ్లింప్స్ ను అమెరికాలోని శాన్ డియాగో కామిక్ కాన్ ఫెస్టివల్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also read:పదేళ్ళ అనుబంధానికి ముగింపు పలికిన ఇటలీ ప్రధాని మెలోనీ