Ramudu: రాముడంటే దేవుడే కాదు.. అంతకు మించి సున్నితమైన భావోద్వేగ బంధం రాముడు అంటే దేవుడు మాత్రమే కాదు. అంతకు మించిన ఎమోషన్. రాముని కథ విన్నా.. రాముని పేరుతో వచ్చిన సినిమా చూసినా.. అదంతా రాముడిని మనవాడిగా మనసులో నిలుపుకున్న భావన. రాముడు పేరుతో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలావరకూ అన్నీ హిట్స్. రామ నామంలోని గొప్పతనం ఈ కథనంలో తెలుసుకోవచ్చు By KVD Varma 21 Jan 2024 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Ramudu: రాముడు అంటే.. దేశవ్యాప్తంగా అత్యంత భక్తి కనిపిస్తుంది. ఉత్తర భారతంలో రాముడిని దేవునిగా పూజిస్తారు. అయితే, దక్షిణ భారతావనికి వచ్చేసరికి రాముడు దేవుడు మాత్రమే కాదు.. మన కుటుంబ సభ్యుడు అన్నంతగా ప్రేమిస్తారు. నిజానికి దేవుడిగా ఎంత భక్తిని చూపిస్తారో అంతకు మించి రాముడు(Ramudu) అంటే ఒక స్నేహితుడిలా.. ఒక బంధువులా.. మన మనిషే అన్నంత ఇదిగా ప్రేమను చూపిస్తారు. ఈ ప్రేమ ఎలా ఉంటుంది అంటే.. కోపం వస్తే మన మనిషిని ఎలా అరుస్తామో.. సంతోషంలో మన వారితో ఎలా వ్యవహరిస్తామో.. అలా రాముని విషయంలో కూడా మన తెలుగు ప్రజల ధోరణి ఉంటుంది. ఇందుకు ఉదాహరణ మన భక్త రామదాసు కీర్తనల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తనను జైలులో వేసినపుడు రామదాసు రాముడిని ఉద్దేశించి.. సీతమ్మకు చేయిస్తి చింతాకు పతాకం రామచంద్రా అంటూ.. ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు అని కడిగేస్తాడు. తరువాత.. దెబ్బలకోర్వలేక అనేశాను మన్నించు అని అడుగుతాడనుకోండి. ఇలా మన తెలుగు ప్రజల మనసులో రాముడు(Ramudu) అంటే మన ఇంటి వాడు. మన కష్టం.. మన సంతోషం అన్నీ చెప్పుకోగలిగే మనవాడు అనే భావన చాలా ఎక్కువ. ఇదిగో సరిగ్గా ఇదే.. మన సినిమా వాళ్ళు పట్టేసుకున్నారు. తెలుగు ప్రజల మనస్సుల్లో తిష్ట వేసుకున్న రాముడిని జాగ్రత్తగా కమర్షియల్ గా వాడేసుకున్నారు. ఆధ్యాత్మికంగా సీతారాముల కళ్యాణం వంటి సినిమాలు తీసినా.. సాంఘికంగా రాముడు పేరుతో డజన్ల కొద్దీ సినిమాలు జనం మీదకు వదిలేశారు. వాటిలో చాలా సినిమాలు హిట్ అయ్యాయి. తెలుగు ప్రజలకు రాముడితో ఉన్న ఎమోషనల్ కనెక్షన్ వర్కౌట్ అయింది సినిమా వాళ్ళకి. సరిగ్గా ఈ ధోరణి ఎప్పుడు మొదలైందో చెప్పడం కష్టం కానీ, రాముడు-భీముడు అంటూ ఎన్ఠీఆర్ తో రామానాయుడు సినిమా నుంచి రాముడు పేరుతో ఎన్ఠీఆర్ తీసిన సినిమాల్లో చాలా వరకూ హిట్స్. అడవి రాముడు(Ramudu), అగ్గి రాముడు, పిడుగు రాముడు, ఛాలెంజ్ రాముడు, కలియుగ రాముడు, సర్కస్ రాముడు, టైగర్ రాముడు, శభాష్ రాముడు, బండ రాముడు, రాముని మించిన రాముడు ఇలా చాలా సినిమాలు తీసేశారు ఎన్టీఆర్ తో. దీనికి మరోకారణమూ ఉంది రాముడు అంటే రామారావు లా ఉంటాడు అని తెలుగు ప్రజల అభిప్రాయం. రాముని పాత్రలో ఎన్టీఆర్ ని మెచ్చినంతగా జనం మారే హీరోనీ మెచ్చలేదు. అందుకే రాముడిలానే ఆయన్ను కూడా దేవుడిలా చూసుకున్నారు. ఆయనను మనవాడు అనుకున్నట్టే రాముడిని కూడా మావాడు అని పిలుచుకున్నారు. Also Read: అయోధ్య రామమందిరంలో ప్రపంచంలోనే ఖరీదైన రామాయణం తరువాతి తరాల హీరోలూ రాముడి పేరుతో చాలా సినిమాలు చేశారు. వాటిలో కూడా ఎక్కువ హిట్స్ ఉన్నాయి. దొంగ రాముడు, భలే రాముడు, అందాల రాముడు, రావణుడే రాముడైతే, రాముడొచ్చాడు, తోట రాముడు.. ఇలా లెక్కలేనన్ని సినిమాలు వచ్చాయి. రాముడు(Ramudu) అంటే కచ్చితంగా మంచి చేసేవాడు. మంచి చెప్పేవాడు. ఒక పాజిటివిటీ ఆ పేరులో ఉంది అని నమ్ముతారు. అందుకే రాముడు పేరుతో సినిమా వస్తోంది అంటే చాలు తెలుగు ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు. తరాలు మారినా.. తరాంతరాలు పెరిగినా.. మనలో రాముడి పై ఉన్న భావన కాలానికి.. కులానికి.. అన్నిటికీ అతీతమైనది. రామనామం అంటే అదోరకం పులకింత. రాముడు అంటే అన్నిటినీ మించిన పలవరింత. అది ఆధ్యాత్మికంగా అయినా.. సాంఘికంగా అయినా.. గుడిలో అయినా.. బడిలో అయినా.. కథలో అయినా.. సినిమాలో అయినా.. ఎలా అయినా సరే రాముడు(Ramudu) మనవాడు. రామ కీర్తనమే చేయాలనే రూలు లేదు.. రామ అనుకుంటే చాలు మన మనసు ఎంతటి కష్టంలో అయినా కుదుట పడిపోతుంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం.. బాల రాముని ప్రతిష్ట వేళలో దేశమంతా రామ నామ జపంలో తరించిపోతోంది. భక్తి భావనతో శ్రీరాముడు పుట్టిన ప్రాంతం.. రాముడు తిరుగాడిన నేల.. రామ పాద స్పర్శతో పునీతమైన దేశం పులకరించి పోతోంది. ఈ సందర్భంగా రాముడు అంటే దేవుడే కాదు.. మన మనసులో నిరంతరం కొలువై ఉండే ధర్మ రక్షకుడు.. రాముడితో మనకు ఉన్నది దైవ - మానవ సంబంధం కాదు.. తరతరాలను కలిపి ఉంచే సున్నితమైన భావోద్వేగ బంధం అని చెప్పాలనే ఈ కథనం. Watch this interesting Video : #ayodhya #ayodya-rama-mandir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి