Alluri Sitaramaraju : రంపచోడవరంలో పిచ్చి కుక్క స్వైర విహారం..16 మందిపై దాడి

రంపచోడవరంలో పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరు కాదు ఇద్దరూ కాదు.. ఏకంగా 16 మందిపై దాడి చేసింది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పులి మారిదిగా రెచ్చిపోయింది. పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్పారు.

New Update
Alluri Sitaramaraju : రంపచోడవరంలో పిచ్చి కుక్క స్వైర విహారం..16 మందిపై దాడి

రక్తం చిందేంత వరకు విడిచిపెట్టలే..

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తోంది. గ్యాస్ గోడౌన్ సమీపంలో మంగళవారం ఉదయం ఒక్కరోజే దాదాపు 16 మందికి పైగా దాడి చేసింది. పెద్ద,చిన్న, ముసలి తేడా లేకుండా కంట పడిన ప్రతీ ఒక్కరినీ కరిచేసింది. శరీరాలపై ముక్కలు ఊడినట్లు రక్తం చిందేంత వరకు విడిచిపెట్టకుండా పిచ్చికుక్క గాయపరిచింది. కుక్క దాడిలో గాయపడ్డ వారు ప్రథ‌మ చికిత్స కోసం స్థానిక రంపచోడవరం ఏరియా ఆరోగ్య కేంద్రానికి క్యూ కట్టారు.

ప్రధమ చికిత్స చేసిన వైద్యులు

బాధితులకు అక్కడ ప్రధమ చికిత్స అందించారు వైద్య సిబ్బంది. తక్షణమే ఏంటీ రేబీస్‌ వ్యాక్సిన్లు వేసి, చికిత్స అందించాలని ఆస్పత్రి వైద్యులు. మరికొంత మందికి స్వల్ప గాయాలవ్వడంతో వ్యాక్సిన్‌ వేయించుకుని ప్రధమ చికిత్స చేశారు. దాడిలో గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులకు గాయాలు. 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

పిచ్చికుక్కను హతమార్చిన స్థానికులు

ఇంత దారుణమైన ఘటన జరగడంతో రంపచోడవరం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రోజురోజుకు వీధి కుక్కల బెడద ఎక్కువ కావడంతో స్థానికలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతధికారులు స్పందించి కుక్కల దాడి నుంచి ప్రజలను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.16 మందిపై దాడికి తెగబడంతో హుటాహుటిన పిచ్చికుక్కను హతమార్చిన స్థానికులు.

జిల్లా వాసుల విజ్ఞప్తి

అయితే.. ఈ పిచ్చికుక్కలు గతంలో కూడా తెలుగు రాష్ట్రాలలో చిన్న పిల్లలను బలి తీసుకున్న విషయం తేలిసిందే. హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మరణించారు. ఈ కుక్కల దాడి విషయంతో హైకోర్టులు కూడా స్పందించింది. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌గూడలో వీధి కుక్కల స్వైర విహారం చేసింది. బాలుడికి తీవ్రగాయాలు కాగా.. మరో ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇలాంటి ఘటనలను మరవకముందే ఇవాళ మరో ప్రాంతంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. 16 మందిని కరిచింది. గ్రామాలు, పట్టాణలు అనే తేడా లేకుండా పిచ్చికుక్క స్వైర విహారం చేసి కాటేస్తున్నాయి. ఇకనైనా ఈ పిచ్చికుక్కల బెడద నుంచి మున్సిపాలిటీ అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు