/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Ramoji-Rao.jpg)
Ramoji Rao Passes Away: రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం మృతి చెందారు. ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం 4. 50 గంటలకు కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు.
The passing away of Shri Ramoji Rao Garu is extremely saddening. He was a visionary who revolutionized Indian media. His rich contributions have left an indelible mark on journalism and the world of films. Through his noteworthy efforts, he set new standards for innovation and… pic.twitter.com/siC7aSHUxK
— Narendra Modi (@narendramodi) June 8, 2024
రామోజీరావు కృష్ణాజిల్లా పెదపారుపూడి 1936 నవంబర్ 18న జన్మించారు. ఈయన నాన్నగారు రైతు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి కెంటక సుబ్బారావు. రామోజీరావు స్థాపించిన కామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకు దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది.
ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం ..
దివి కేగింది 🙏💔🙏 ఓం శాంతి 🙏 pic.twitter.com/a8H8t9Tzvf
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 8, 2024
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో..
ప్రస్తుతం 87 ఏళ్ల వయసున్న ఆయన గతంలోనూ అనారోగ్యంతో బాధపడ్డారు. వైరల్ ఫీవర్, వెన్నునొప్పి, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఇక ఈనాడు గ్రూప్కు చైర్మన్, రామోజీ ఫిల్మ్ సిటీకి యజమాని అయిన రామోజీరావు.. 60కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. దశాబ్దాల తరబడి తెలుగు రాజకీయాలపై తనదైన శైలిలో ప్రభావం చూపారు.
ఈనాడు గ్రూప్స్ రామోజీరావు గారి మృతి చాలా బాధాకరం!
ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీరని లోటు.అతి సామాన్య కుటుంబంలో పుట్టి పత్రిక, మీడియా, టెలివిజన్ రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి తెలుగు జాతికి రామోజీ రావు గర్వకారణంగా నిలిచారు. రామోజీ రావు గారి జీవితం అత్యంత నిబద్ధత , క్రమశిక్షణ… pic.twitter.com/uILKJijj5f— Ponnam Prabhakar (@PonnamLoksabha) June 8, 2024
ఈనాడు వ్యవస్థాపకులు, ఆత్మీయులు శ్రీ రామోజీరావు గారు పరమపదించారని తెలిసి విచారించాను. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో వారు సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయమైనది. తెలుగు భాష-సంస్కృతులకు వారు చేసిన సేవ చిరస్మరణీయమైనది. తెలుగు వారి వెలుగు, మార్గదర్శి అయినా… pic.twitter.com/NQIQjSfDZZ
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) June 8, 2024