Rameshwaram Cafe Blast: రామేశ్వరం పేలుడు కేసులో షరీఫ్ అరెస్ట్ బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఒకరిని అరెస్ట్ చేసింది NIA. నిందితుడి షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన NIA అధికారులు.. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. రామేశ్వరం కేఫ్ పేలుడు వెనకాల భారీ కుట్ర ఉందని అన్నారు. By V.J Reddy 28 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి NIA Arrests Key Conspirator Muzammil Shareef: బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో ఒకరిని అరెస్ట్ చేసింది NIA. నిందితుడి ముజమ్మిల్ షరీఫ్ ను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలోని 12 ప్రాంతాల్లో, తమిళనాడులోని 5 ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతంలో.. మొత్తం 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన NIA అధికారులు.. ఈ పేలుడులో ఉన్న కీలక సూత్రధారులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారులైన ముస్సావిర్ షజీబ్ హుస్సేన్, అబ్దుల్ మతీన్ తాహా పరారీలో ఉన్నారు. వీరిని గాలించే పనిలో పడ్డారు NIA అధికారులు. అయితే, ప్రస్తుతం పట్టుబడ్డ ముజమ్మిల్ షరీఫ్ ఈ పేలుడు జరపడం కోసం పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు. రామేశ్వరం కేఫ్ పేలుడు (Rameshwaram Cafe Blast) కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు NIA అధికారులు. తనిఖీల్లో నిందితుల ఇళ్లల్లో కిలక ఆధారాలను NIA కనుక్కున్నట్లు తెలుస్తోంది. భారీ నగదు, ఎలెక్ట్రానిక్ పరికరాలను అధికారులు గుర్తించారు. కాగా పరారీలో ఉన్నవారిని త్వరలోనే పట్టుకుంటామని NIA వెల్లడించింది. NIA Arrests 1 in Rameshwaram Cafe Blast Conspiracy After Massive Multi-State Raids pic.twitter.com/QI4ZpvBpQV — NIA India (@NIA_India) March 28, 2024 Also Read: ఎంపీగా పోటీ చేయబోతున్న స్టార్ హీరో.. ఏ నియోజకవర్గమో తెలిస్తే షాక్ అవుతారు! #nia #rameshwaram-cafe-blast మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి