Singareni: రామగుండం ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ప్రమాదం.. ఇద్దరు మృతి

సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ఓసీపీ-2లో పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతులు చేస్తుండగా మట్టి పెళ్లలు కూలాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఫిట్టర్‌ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్‌ సాగర్‌గా గుర్తించారు.

Singareni: రామగుండం ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ప్రమాదం.. ఇద్దరు మృతి
New Update

పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్‌ కాస్ట్‌ గనిలో ప్రమాదం జరిగింది. ఓసీపీ-2లో పైప్‌లైన్‌ లీకేజీని అరికట్టేందుకు మరమ్మతులు చేస్తుండగా మట్టి పెళ్లలు కూలాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఫిట్టర్‌ ఉప్పు వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్‌ సాగర్‌గా గుర్తించారు. మృతదేహాలను గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు.ఈ ప్రమాదంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: అప్పులున్నాయి.. అయినా రుణమాఫీ అమలు చేస్తున్నాం : భట్టి విక్రమార్క

#telugu-news #coal-mining #mining #ramagundam
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe