Ram Mandir: రామ మందిరంపై బిగ్ అప్‌డేట్.. ఓపెనింగ్ డేట్ ఇదే..

అయోధ్య నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా సిద్ధమైంది. గర్భగుడి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న రామ మందిరానికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి.

New Update
Ayodhya : ఆ స్థాయిలో భూకంపం వచ్చినా రామమందిరం చెక్కు చెదరదు.. అయోధ్య రాముడి ఆలయ ప్రత్యేకత ఇదే!!

Ram Mandir Latest Updates: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ తేదీకి సంబంధించి బిగ్ అప్‌డేట్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన రామాలయాన్ని ప్రారంభించనున్నట్లు శ్రీరామ జనమభూమి తీర్థ క్షేత్ర(Shri Ram Janmbhoomi Teerth Kshetra) ప్రతినిథులు చెబుతున్నారు. ఆ రోజునే గర్భగుడిలో రాంలల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుందన్నారు. అయోధ్య(Ayodhya)లో జరుగుతున్న సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాంలల్లా ప్రాణ ప్రతిష్టకు వారం రోజుల ముందు నుంచే పూజలు ప్రారంభమవుతాయని శ్రీరామ జనమభూమి తీర్థ క్షేత్ర ప్రతినిథులు తెలిపారు. అయితే, రామ మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం ఇప్పటికే పూర్తయ్యింది. గర్భగుడి నిర్మాణం కూడా పూర్తయ్యింది.

రామ మందిర నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది..

అయోధ్య నిర్మిస్తున్న రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా సిద్ధమైంది. గర్భగుడి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయని చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న రామ మందిరానికి సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఆలయానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.

ప్రపంచ దేశాల నుంచి అతిథులు..

అయోధ్యలో నిర్మాణంలో ఉన్న శ్రీరామజన్మభూమి ఆలయంలో రాంలల్లా సింహాసనాన్ని అధిష్టించే ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించడం జరుగుతుందన్నారు. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం ప్రారంభోత్సవం కోసం శ్రీరాముని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా రామ భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉన్నందు.. అందుకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు చెబుతున్నారు. ఇక శ్రీరామ మందిర తీర్థ క్షేత్రం ద్వారా దేశ వ్యా్ప్తంగా ఉన్న మత పెద్దలకు, ప్రపంచంలోని 160 దేశాల ప్రతినిధులకు ఆహ్వానాలు పంపడం జరుగుతుందని తెలిపారు.

సాధువులు, ఋషులకు ఆహ్వానాలు..

అయోధ్యలోని అన్ని ప్రధాన మఠాల సాధువులకు కూడా ట్రస్ట్ ఆహ్వానాలు పంపుతుందని చంపత్ రాయ్ చెప్పారు. శ్రీరామ జన్మభూమి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో 10 వేల మంది ప్రత్యేక అతిథులు, 25 వేల మంది సాధువులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలకు ఉచిత భోజనం వడ్డించడం జరుగుతుందని చంపత్ రాయ్ తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం దాదాపుగా పూర్తవుతుందన్నారు. కర్ణాటకలోని మైసూర్ నుంచి తెప్పించిన రాళ్లతో రాంలల్లా విగ్రహాన్ని తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజస్థాన్‌లోని మక్రానా పాలరాతితో మరో విగ్రహాన్ని కూడా తయారు చేస్తున్నట్లు సమాచారం.

Also Read:

Nara Bhuvaneshwari: చంద్రబాబును రక్షించమని అమ్మవారిని కోరుకున్నా: భువనేశ్వరి

Bharat: ఇండియా పేరు భారత్‌గా మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందంటే..?

Advertisment
తాజా కథనాలు