Ram Mandir: జనవరి 16 నుంచి 24 మధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట: ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి
జనవరి 16 నుంచి 24 మధ్య ఒక శుభ ముహూర్తంలో ఆలయ కింది అంతస్తులో నిర్మించిన గర్భగుడిలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చంపత్ రాయ్ తెలిపారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదివారం నిరంజనీ అఖారాకు చేరుకుని అఖిల భారతీయ అఖారా పరిషత్ (నిరంజని) అధ్యక్షుడు శ్రీమహంత్ రవీంద్రపురి మహరాజ్‌ను కలిసిన అనంతరం ఈ ప్రకటన చేశారు.