Ayodhya Solar Boat: సోలార్ బోటు ప్రత్యేకత ఇదే.. సరయూలో 'మారుతి'ని ప్రారంభించిన యోగి!

రూఫ్ టాప్ మౌంటెడ్ సోలార్ బోట్ సర్వీస్‌ను యూపీ సీఎం యోగి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ సోలార్ టెక్నాలజీ ఆధారిత బోట్‌ సర్వీసును స్టార్ట్ చేశారు. సరయూ నదిలో బోటు ఎక్కి నది ఒడ్డున నిర్మించిన తేలియాడే జెట్టీ, ఫ్లోటింగ్ బోట్ ఛార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించారు.

New Update
Ayodhya Solar Boat: సోలార్ బోటు ప్రత్యేకత ఇదే.. సరయూలో 'మారుతి'ని ప్రారంభించిన  యోగి!

Ayodhya Solar Boat Start: ఉత్తరప్రదేశ్(UttarPradesh) ఆధ్యాత్మిక రాజధానిగా అయోధ్య(Ayodhya)ను అభివృద్ధి చేయాలన్న యోగి ప్రభుత్వ కల సాకారమైంది. యావత్‌ దేశం ఇప్పుడు అయోధ్య వైపే చూస్తోంది. రామమందిర ప్రాణప్రతిష్ఠ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తుండగా.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌(Yogi Adityanath) తన పని తాను చేసుకుపోతున్నారు. దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అయోధ్యకు త్రేతాయుగ వైభవాన్ని పునరుద్ధరించానికి యోగి కృషి చేస్తున్నారు. అయోధ్యకు ఆధునికత జోడిస్తున్నారు. ఇందులో భాగంగానే'నవ్య అయోధ్య' ప్రాజెక్టు భారీ విజయాన్ని సాధిస్తోంది. సోలార్, క్లీన్ ఎనర్జీ, బోటు రవాణా, అంతర్గత జలమార్గాల పరంగా సరయూ నదిని రోల్ మోడల్‌గా నిలబెట్టే దిశలో సీఎం యోగి కొత్త అధ్యాయానికి పునాది వేశారు. దీంతో ఆయనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

'మారుతీ' ప్రారంభం:
జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం అయోధ్యకు వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అభివృద్ధి చేసిన రూఫ్ టాప్ మౌంటెడ్ సోలార్ బోట్ సర్వీస్‌ను ప్రారంభించారు. ఎలక్ట్రిక్ సోలార్ టెక్నాలజీ ఆధారిత బోట్‌ సర్వీసును ప్రారంభించడం ఆసక్తిని రేపింది. ఈ బోటు నిర్వహణకు సంబంధించిన అన్ని సాంకేతిక అంశాలను పరిశీలించడంతో పాటు లోతట్టు జలమార్గాల అభివృద్ధికి అయోధ్యలో జరుగుతున్న ప్రయత్నాలను అడిగి తెలుసుకున్నారు సీఎం. ఈ సందర్భంగా బటన్ నొక్కి బోటు ఆపరేషన్ ప్రారంభించారు. సరయూ నదిలో బోటు ఎక్కి నది ఒడ్డున నిర్మించిన తేలియాడే జెట్టీ, ఫ్లోటింగ్ బోట్ ఛార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించారు.

సరయూ నది ఉత్తరాఖండ్‌లోని మధ్య కుమావూన్ ప్రాంతంతో ప్రవహించే ఒక ప్రధాన నది. సర్ముల్ నుంచి ఉద్భవించిన సర్జు కప్కోట్, బాగేశ్వర్, సెరాఘాట్ నగరాల గుండా ప్రవహించి పంచేశ్వర్ వద్ద మహాకాళిలో కలుస్తుంది. శారదా నదికి సర్జు అతిపెద్ద ఉపనది. ఈ నది పితోర్గఢ్, అల్మోరా జిల్లాల మధ్య ఆగ్నేయ సరిహద్దును ఏర్పరుస్తుంది. సమశీతోష్ణ, ఉప ఉష్ణమండల అడవులు నది పరీవాహక ప్రాంతం మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఈ నదికి పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

Also Read: దేశమంతా రామమయం.. జనవరి 22న సెలవు ప్రకటించిన మరో రాష్ట్రం!

Advertisment
Advertisment
తాజా కథనాలు