Ayodhya Ram Temple: నేడు ఆలయంలోకి రానున్న బాలరాముడు.. మొదలైన కార్యక్రమాలు..

యూపీలోని అయోధ్యలో ఈరోజు (బుధవారం) విగ్రహాన్ని గుడి లోపలికి తీసుకున్నారు. కానీ ఈ నెల 22వ తేదినే అసలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక జనవరి 18న అంటే రేపు గర్భగుడిలోకి బాలరాముని విగ్రహాన్ని తీసుకెళ్తారు. నిన్న (మంగళవారం) ప్రాయశ్చిత్త పూజలు జరిగాయి.

New Update
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి ఎక్కువగా విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరగనున్న సంగతి సంగతి తెలిసిందే. అయితే ఈ ఉత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈరోజు (బుధవారం) బాలరాముని విగ్రహాన్ని గుడి లోపలికి తీసుకున్నారు. కానీ ఈ నెల 22వ తేదినే అసలు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక జనవరి 18న అంటే రేపు గర్భగుడిలోకి బాలరాముని విగ్రహాన్ని తీసుకెళ్తారు. అయితే నిన్న (మంగళవారం) ప్రాయశ్చిత్త పూజలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

బాలరాముని కళ్లకు గంతలు

దాదాపు మూడు గంటల పాటు ఈ ప్రాయశ్చిత్త పూజలు జరిగాయి. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడైన డాక్టర్ అనిల్ మిశ్రా ఈ పూజలను నిర్వహించారు. ఆ తర్వాత సరయూ నదిలో పుణ్యస్నానం చేశారు. అనంతరం విగ్రహ నిర్మాణ స్థలంలో కూడా పూజలు చేశారు. అలాగే బాలరాముని విగ్రహాన్ని శుద్ధి చేసి. కళ్లకు గంతలు కట్టారు. ఈ కళ్ల గంతలు జనవరి 22న తెరవనున్నారు. ఆరోజునే అసలు రామలల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది.

Also Read: ఇకనుంచి వాతావరణ సమాచారం మీ చేతిలోనే.. యాప్‌ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి..

7 వేల మందికి పైగా ఆహ్వానాలు

మధ్యాహ్నం 1.30 PM తర్వాత జలయాత్ర, తీర్థపూజ, వర్ధని పూజలు జరుగనున్నాయి. ఇదిలాఉండగా.. రామాలయ ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆలయ ట్రస్ట్‌ దాదాపు 7 వేల మందికి పైగా ఆహ్వానాలు పంపింది. మరో విషయం ఏంటంటే అయోధ్యకు వచ్చే భక్తులు రామాలయంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని ‘దివ్య్‌ అయోధ్య’ అనే యాప్‌ ద్వారా తెలుసుకోవచ్చని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది. ఈ యాప్‌ను ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ విడుదల చేశారు. ఇక జనవరి 19 నుంచి లఖ్‌నవూ, అయోధ్య మధ్య హెలికాప్టర్‌ సేవలను ప్రారంభించనున్నారు.

టెంట్‌ సిటీ

మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యాటక శాఖ అయోధ్యకు వచ్చే అతిథుల కోసం ఏకంగా ఓ టెంట్‌ సిటీనే ఏర్పాటు చేసింది. అధునాతన సదుపాయాలున్న ఈ టెంట్‌ సిటీని వీవీఐపీల బస కోసం కేటాయించనున్నారు. ‘నిషాద్‌రాజ్‌ అతిథిగృహ్‌’ పేరిట నిర్మించిన ఈ టెంట్‌ సిటీలో మెుత్తం 4 కాటేజీలు ఉండనున్నాయి. ఇక భోజనాల కోసం సీతా రసోయి, శబరి రసోయి అనే రెండు డైనింగ్‌ హాళ్లను కూడా నిర్మించారు. ఇందులో ఒకటి వీవీఐపీలకు, ఇంకొటి వీఐపీలకు కేటాయించారు. ఈ హాళ్లలో రోజుకు 500 మంది వరకు భోజనాలు చేయవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.

Also Read: ఫిబ్రవరి 28న డబ్ల్యూఈఎఫ్‌ సెంటర్‌..వేదిక కానున్న హైదరాబాద్‌!

Advertisment
తాజా కథనాలు