/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/rgv-jpg.webp)
RGV: జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan)ని ఉద్దేశించి వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) ఓ ట్వీట్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్స్ మెడల్ అంటూ ఆల్కహాల్ బ్రాండ్స్ పేరుతో ఎగతాళి చేస్తోన్న పవన్ కల్యాణ్ దీనిని చూడాలి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఏపీ సీఎం జగన్(AP CM Jagan) అసెంబ్లీలో మద్యం గురించి మాట్లాడారు.
Jana senani @pawankalyan needs to see this immediately in the context of him making fun of alcohol brands called Boom Boom ,President’s Medal etc https://t.co/oZF1RRbx4X via @YouTube
— Ram Gopal Varma (@RGVzoomin) September 28, 2023
ఇందులో మద్యం బ్రాండ్ల గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పేర్లు వింటే తనకే ఆశ్చర్యం వేస్తోందని, ఈ బ్రాండ్లు ఏమిటి? అనిపిస్తోందన్నారు. వారు ప్రచారం చేస్తోన్న మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువే అన్నారు. ఆయన హయాంలోనే వచ్చాయన్నారు. ఆయన ప్రచారం చేసే ప్రతి ఒక్కటీ చంద్రబాబు బ్రాండ్లే అన్నారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు-ఇళ్లు, దిశ మాత్రమే మన ప్రభుత్వం బ్రాండ్స్ అని చెప్పారు.
బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్స్ మోడల్, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, ట్రిపుల్ నైన్ లెజెండ్ మద్యం బ్రాండ్స్ మాత్రం అన్నీ చంద్రన్న కానుకలు అని విమర్శలు గుప్పించారు. ఇవే కాకుండా హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హాంగర్, ఇంకా ఇలాంటివి దాదాపు 250 బ్రాండ్స్ ఉన్నాయన్నారు. ఇవన్నీ చంద్రబాబు హయాంలో వచ్చాయని చెప్పారు.
కాగా, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ దీన్ని నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంటోంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు.
Also Read: వినాయక చవితి అంటే గుర్తుకు వచ్చేది ఇదే.. రంగమార్తాండాతో ఆ కోరిక తీరింది!