RGV : రాజమౌళి - మహేష్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఊహలకే అందదంటూ..!

రాజమౌళి - మహేష్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..' ఈ సినిమా ఇండియన్‌ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. రాజమౌళి విజన్‌, మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్‌ కలిసి సినిమాను మరింత ప్రత్యేకంగా చేస్తాయని' అన్నారు.

RGV : రాజమౌళి - మహేష్ మూవీపై RGV ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఊహలకే అందదంటూ..!
New Update

Ram Gopal Varma : ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు - దర్శకుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమానే. ఈ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ప్రపంచ స్థాయిలో మార్కెట్‌ను అందుకోబోతుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కాంబినేషన్‌పై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఆర్జీవీ ఏమన్నారంటే..?

ఓ ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడుతూ..' మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా భారీ అంచనాలతో సాగుతోంది. ఇద్దరూ తమ కెరీర్‌లో అత్యుత్తమ స్థాయిలో ఉన్నారు. ఈ సినిమా ఇండియన్‌ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. రాజమౌళి విజన్‌, మహేష్‌బాబు పెర్ఫార్మెన్స్‌ కలిసి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా చేస్తాయని' అన్నారు.

Also Read : బాలీవుడ్ బాద్షాకు అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన ఫస్ట్ ఇండియన్ హీరోగా షారుఖ్..!

" RRR తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ కోసం సాంకేతిక నిపుణుల బృందానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నాడు. మహేశ్ బాబు, రాజమౌళి సినిమా మన ఊహలకు అందని విధంగా ఉండబోతుందనుకుంటున్నానన్నాడు. రాజమౌళి విజయం తెలుగు సినిమాకు సంబంధించినదని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అతడు గుజరాత్‌ వ్యక్తి అయినా.. తను అలాంటి సినిమాలనే తెరకెక్కించి అవే అత్యున్నత శిఖరాలను వెళ్లేవాడంటూ" ప్రశంసలు కురిపించాడు.

సోషల్‌మీడియాలో రచ్చ

ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. మహేష్‌బాబు, రాజమౌళి ఫ్యాన్స్‌ ఈ కామెంట్స్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆర్జీవీ కామెంట్స్‌ వల్ల ఈ అంచనాలు మరింతగా పెంచేశాయి.

#ssmb-29-movie #rajamouli-mahesh-movie #ram-gopal-varma
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి