Ram Charan - NTR : ఆ ఇద్దరూ దాదాపుగా ఒకేసారి తెలుగు చిత్రసీమ(Telugu Cine Industry) లో అడుగుపెట్టారు. ఇద్దరికీ వారసత్వ నేపధ్యం ఉంది. ఒకరు తెలుగు సినిమా చరిత్రనే తిరగరాసి.. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన నందమూరి తారకరామారావు పేరుతోనే సత్తా చాటిన నటుడు. మరొకరు దశాబ్దాలుగా తెలుగు సినిమా తెరపై మెగాస్టార్ గా వెలుగుతూ.. అప్పుడు ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచిన.. నిలుస్తున్న చిరంజీవి వారసుడు రామ్ చరణ్. ఇద్దరిదీ నటనలో దమ్ము.. కష్టపడగలిగే తత్త్వం.. అన్నిటినీ మించిన స్నేహబంధం(Ram Charan vs NTR) కలిగిన బాటే. కానీ, ఇటీవల కాలంలో చూస్తే కనుక ఎన్ఠీఆర్ కంటే రామ్ చరణ్ ప్రతి అంశంలోనూ ముందు కనిపిస్తున్నాడు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కానీ, పాప్యులారిటీ పెంచుకోవడంలో కానీ అన్నిటినీ మించి తనను తాను ప్రమోట్ చేసుకోవడంలో కానీ రామ్ చరణ్ దూసుకుపోతున్నాడు. కానీ, ఎన్టీఆర్ మాత్రం వెనుకపడిపోతున్నట్టు కనిపిస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది.
టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య తేడా గురించిన విషయాలను ఒకసారి గమనిద్దాం. రామ్ చరణ్, తారక్(Ram Charan vs NTR) ఇద్దరూ రాజమౌళి ప్రెస్టీజియస్ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించారు. ఇద్దరికీ సినిమాలో సమానమైన ప్రాధాన్యత. ఒకరు అల్లూరి సీతారామరాజుగా, మరొకరు కొమరం భీమ్ గా ఒకరికి ఒకరు పోటీ పడుతూ నటించారు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు అనే విషయంపై పెద్ద పెద్ద సినీ విమర్శకులే ఏమీ తేల్చలేకపోయారు. ఎవరి స్టైల్ లో వాళ్ళు సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేయడమే కాదు.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక సినిమాలోని నాటు.. నాటు పాటకి అయితే ఇద్దరూ కలిసి చేసిన డాన్స్ ప్రపంచ వ్యాప్తంగా దుమ్ము రేపింది. ఇద్దరి ఎనర్జీ.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ.. సెప్పుల్లో స్పీడు ఒక్కటేమిటి రామ్ చరణ్, తారక్ లను ఆ పాటలో చూసిన తరువాత భారత సినిమాలో ఇలా చేయగలిగిన మల్టీస్టారర్ ఇప్పటివరకూ రాలేదు.. ఇకపై రాబోదు అన్నట్టు అనిపించింది. ఇంత గొప్పతనం చూపించిన ఇద్దరు నటులు ఇప్పుడు ఎవరికీ వారు తమ సినిమాలు చేసుకుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉంది.
Also Read : ‘ఇది చాలా స్పెషల్’ .. గామా అవార్డు పై ఆనంద్ దేవరకొండ పోస్ట్
కానీ, సమానమైన కష్టం.. సమానమైన పాత్రలు.. అయితే, పాప్యులారిటీ మాత్రం ఒక్కరికే వచ్చినట్టు కనిపిస్తోంది. రామ్ చరణ్ ఇటీవల ముఖ్యమైన వేదికలన్నిటిలోనూ కనిపిస్తున్నాడు. దేశంలోనే కాకుండా విదేశాల్లో జరిగే ప్రధాన ఈవెంట్స్(Ram Charan vs NTR) అన్నిటిలోనూ దాదాపుగా రామ్ చరణ్ కు ఆహ్వానం అందుతోంది. ఉదాహరణకు మొన్ననే జరిగిన ముఖేష్ అంబానీ తనయుడు అంకిత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం అందింది. అక్కడ బాలీవుడ్ ఖాన్ త్రయం, సచిన్ వంటి వారితో చేసిన సందడి అందరం చూశాం. అంతకు ముందు అయోధ్య రామ మందిరం ప్రారంభానికి కూడా రామ్ చరణ్ కు ఆహ్వానం అందింది. అక్కడా రామ్ చరణ్ హడావుడి కనబడింది. రెండోది అంటే రాజకీయ కారణాలు ఉంది ఉండవచ్చు. కానీ, మొదటి వేడుకకు ఎన్టీఆర్ కు ఎందుకు ఆహ్వానం రాలేదు? సమానమైన స్థాయి ఉన్న ఇద్దరి మధ్యలో ఎన్టీఆర్ ఎందుకు వెనుకబడిపోతున్నాడు?
దీనికి కారణంగా పీఆర్ టీమ్ అని చెబుతున్నారు టాలీవుడ్(Tollywood) పరిశీలకులు. ఎందుకంటే, రామ్ చరణ్ పీఆర్ టీమ్ చాలా స్ట్రాంగ్ టీమ్. రామ్ చరణ్ ని ప్రమోట్ చేయడంలో ఆ టీమ్ స్ట్రాటజీకి.. సరితూగే స్ట్రాటజీ ఉన్న పీఆర్ టీమ్ ఎన్టీఆర్ కు లేదని వారి అభిప్రాయం. అందుకే, ఈవెంట్స్ కి ఆహ్వానాలు రావడం విషయంలో.. పాప్యులారిటీ విషయంలో ఎన్టీఆర్ వెనుకబడిపోయారనేది వారు చెబుతూన్న మాట. రామ్ చరణ్ తో పోటీ పడాలని అనడం కాదు కానీ, మనలో ఎంత ప్రతిభ ఉన్నా.. దానిని పదిమందికీ తెలిసేలా చేసుకోవడం చాలా ముఖ్యమే కదా. అది కెరీర్ కి కూడా చాలా ఉపయోగపడుతుంది కదా. ఒకేస్థాయి ఉన్న ఇద్దరు స్టార్స్.. వారి మధ్యలో ఎంత స్నేహం ఉన్నా.. ప్రొఫెషనల్ గా చూసుకుంటే వెనకబడిపోతున్న పరిస్థితి అభిమానులకు కాస్త బాధ కలిగిస్తుంది కదా. ఇప్పుడు టాలీవుడ్ విమర్శకులు అంటున్నది కూడా అదే. ఎన్టీఆర్ పీఆర్ టీమ్ స్ట్రాంగ్ గ తయారైతే.. అభిమానుల్లో జోష్ పెరుగుతుంది అని.
నాటు నాటు పాట ఇక్కడ మరోసారి చూసేయండి :