ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను చాలా కాలం కిందటే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్‌పైకి తీసుకురావడానికి మేకర్స్ ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ క్రమంలో నటీనటులను ఎంపిక చేస్తున్నారు.
ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రవీనా టాండన్ కుమార్తె, రాషా తడానీని, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ముంబై ఫిల్మ్ సర్కిల్స్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాషా తడానీ. ఫొటోషూట్స్ తో ఈమె ఇప్పుడిప్పుడే హాట్ అవుతోంది. ఇలాంటి ముద్దుగుమ్మను చరణ్ సినిమాలోకి తీసుకుంటే, బాగుంటుందని భావిస్తున్నారు. రీసెంట్ గా ఫొటోషూట్ కూడా పూర్తిచేశారు. కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
రాషా తండ్రి, అనిల్ తడాని బాలీవుడ్ లో పాపులర్ పంపిణీదారు. హిందీలో పలు తెలుగు చిత్రాలను విడుదల చేశారు. అక్షయ్ కుమార్ తో లవ్ ఎఫైర్ ఫెయిలైన తర్వాత, అనీల్ తడానీని పెళ్లి చేసుకుంది రవీనా. వీళ్లిద్దరికీ పుట్టిన అమ్మాయే రాషా తడానీ. అయితే ఈ అమ్మాయి కంటే ముందే, రవీనా టాండన్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే వాళ్లు ఆమెకు పుట్టలేదు. వాళ్లను దత్తత తీసుకొని పెంచుతోంది రవీనా. ఇప్పుడు రాషాను తన వారసురాలిగా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తోంది.
ఇక బుచ్చిబాబు విషయానికొస్తే, కొత్త హీరోయిన్ ను పరిచయం చేయడంలో ఇతడికి ఓ ట్రాక్ రికార్డ్ ఉంది. అతడు తీసిన తొలి సినిమా ఉప్పెనతో కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ఆమె స్టార్ అయింది. వరుసపెట్టి సినిమా అవకాశాలు అందుకుంది. బుచ్చిబాబు చేతుల మీదుగా లాంచ్ అయితే, కెరీర్ కు ఢోకా ఉండదనే ఇమేజ్ ఉంది. పైగా ఈసారి రామ్ చరణ్ హీరో. కాబట్టి ఈ ఛాన్స్ ను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవడానికి ఇష్టపడడం లేదు రవీనా టాండన్. ఎలాగైనా కూతుర్ని ఈ ప్రాజెక్టులోకి పంపించాలని ఆమె గట్టిగా ఫిక్స్ అయింది. ఆడిషన్స్ కు కూతురుతో కలిసి హైదరాబాద్ వచ్చిన రవీనా ఫొటోలు వైరల్ అయ్యాయి.