Ram Charan : ఖరీదైన కారులో అంబానీ పెళ్ళికి వెళ్లిన రామ్ చరణ్.. కారు ధర ఎన్ని కోట్లో తెలుసా?

అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహానికి వెళ్లేందుకు రామ్ చరణ్ తన కొత్త రోల్స్‌ రాయిస్‌ స్పెక్టార్‌ను డ్రైవ్‌ చేసుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. దీని ధర దాదాపు రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం. దీన్ని కొనుగోలు చేసిన రెండో వ్యక్తిగా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేశాడు.

New Update
Ram Charan : ఖరీదైన కారులో అంబానీ పెళ్ళికి వెళ్లిన రామ్ చరణ్.. కారు ధర ఎన్ని కోట్లో తెలుసా?

Ram Charan New Rolls Royce Car Going Viral : అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహానికి మన టాలీవుడ్ సెలెబ్రిటీలు కొందరికి ఆహ్వానం అందింది. అందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. ఇందులో భాగంగానే ఈ పెళ్ళికి రామ్ చరణ్ తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి లగ్జరీ కారులో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రామ్ చరణ్ కారు అందరి దృష్టిని ఆకర్షించింది.

దీంతో ఆ కారుకు సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడ్డారు అభిమానులు. ఇక ఆ కారు ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ వివాహానికి వెళ్లేందుకు రామ్ చరణ్ బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే చరణ్ తన కొత్త రోల్స్‌ రాయిస్‌ స్పెక్టార్‌ను డ్రైవ్‌ చేసుకుంటూ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. దీని ధర దాదాపు రూ.7.5 కోట్లు ఉంటుందని సమాచారం.


Also Read : ‘భారతీయుడు 2’ మూవీ రివ్యూ.. శంకర్ మ్యాజిక్ రిపీట్ అయిందా? సేనాపతి తాత ఎలా చేశాడంటే?


ప్రస్తుతం ఈ కారు ఇండియాలో రెండోది కావడం విశేషం. అలాగే సౌత్‌ ఇండియాలో మొదటి కారు. దీన్ని కొనుగోలు చేసిన రెండో వ్యక్తిగా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేశాడు. రోల్స్ రాయిస్ కారుకు ఓప్రత్యేకత ఉంది.అతి తక్కువ మంది దగ్గరే ఈ కంపెనీ కారు ఉంటుంది. మెగాస్టార్​ చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ లిస్ట్ లో చెర్రీ కూడా చేరిపోయాడు. అతను కొన్న రోల్స్ రాయిస్‌ స్పెక్టార్‌ జనవరి 2024 లాంఛ్‌ అయింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు