Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌ సినిమా సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్.!

రామ్ చ‌ర‌ణ్‌ ‘గేమ్ చేంజర్’ మూవీ నుండి గతంలో ఓ పాట లీక్ అయింది. దీనిపై నిర్మాత దిల్ రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా, ఈ లీకులో భాగమైన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Ram Charan: రామ్ చ‌ర‌ణ్‌ సినిమా సాంగ్ లీక్.. ఇద్దరు అరెస్ట్.!

Game changer Song Leak: గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) హీరోగా సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజ‌ర్‌’. RRR వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ చేస్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇటీవల గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించిన వరుస లీకులు చిత్ర యూనిట్ ని బాగా ఇబ్బంది పెట్టాయి.

Also Read: సమంతకు క్రయోథెరపీ.. ఈ ట్రీట్మెంట్ ఎందుకు తీసుకుందంటే..?

publive-image

రాంచరణ్ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. ఒక పాత్రలో రాంచరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. తండ్రి పాత్రలోని లుక్ ఇంటర్నెట్ లో లీక్ అయింది. ఆ తర్వాత ఒక సాంగ్ లీక్ అయింది. తరచుగా ఇలా గేమ్ చేంజర్ చిత్రానికి సంబందించిన పిక్స్ ఇంటర్నెట్ లో లీక్ అవుతూనే ఉన్నాయి. దీంతో నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆగ్రహం వ్యక్తం చేశారు.

publive-image

సాంగ్ లీక్ పై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు కేసుని ఛేదించారు సైబరాబాద్ పోలీసులు. ఈ లీకులో భాగమైన ఇద్దరిని అరెస్ట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి లీకులు చేయొద్దని హెచ్చరించారు.సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీ చాంద్ భాషా, ఎస్సై శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ ప్రసేన్ రెడ్డి, శ్రీ సాయి తేజ్ గార్ల బృందం ఈ కేసును చేధించారు. సాంగ్‌ లీక్ చేసిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి మీద ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, 66 ఆర్/డబ్ల్యూ కింద కేసు నమోదు చేశారు.

publive-image

కాగా, దీపావ‌ళి సంద‌ర్బంగా ‘గేమ్ ఛేంజ‌ర్’ సినిమా నుంచి తొలి సాంగ్‌ను విడుద‌ల చేస్తున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేషనల్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌ల‌తో (Director Shankar) పాటు మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ (SS Thaman)క‌లిసి తొలిసారి వ‌ర్క్ చేస్తున్న గేమ్ ఛేంజ‌ర్ సినిమా నుంచి పాట‌ను పాన్ ఇండియా రేంజ్‌లో దీపావళికి గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. జరగండి అంటూ సాగే ఈ పాట కోసం శంకర్ కోట్లాది రూపాయల సెట్ వేయించినట్లు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఈ సాంగ్ విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతున్నట్లు టాక్.

Advertisment
తాజా కథనాలు