/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T152847.141.jpg)
Ram Charan, Allu Arjun Birth Day Wishes To NTR : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నేడు తన పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అటు అభిమానులు ఇటు సెలెబ్రిటీలు తారక్ కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తో మంచి బాండింగ్ మైంటైన్ చేసే తోటి స్టార్స్ అయిన రామ్ చరణ్, అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కి విషెష్ తెలిపారు.
నా ప్రియమైన తారక్ కి..
రామ్ చరణ్ తన ట్విట్టర్ లో.." నా ప్రియమైన తారక్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాను" అంటూ RRR షూటింగ్ టైం లో ఎన్టీఆర్ తో కలిసున్న ఫోటోను పంచుకున్నాడు.
Also Read : ఎన్టీఆర్‌కు హృతిక్ స్పెషల్ ట్వీట్.. వార్-2పై అదిరే అప్‌డేట్
హ్యాపీ బర్త్ డే బావ..
బన్నీతో తారక్ కి ఎంతో మంచి బాండింగ్ ఉంది. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమగా బావ బావ అంటూ పిలుచుకుంటారు. ఈ రోజు తారక్ బర్త్ డే కావడంతో బన్నీ తన ట్విట్టర్ లో.." మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బావ … భయం అంటే నిప్పు" అంటూ కొన్ని ఫైర్ ఈమోజీలను జత చేశాడు.
Many many happy returns of the day Bava … FEAR is FIRE 🔥🔥🔥 @tarak9999
— Allu Arjun (@alluarjun) May 20, 2024