Ram Charan: పొడవాటి జుట్టు, క్లీన్ షేవ్.. యాక్టింగ్‌ స్కూల్‌లో రాంచరణ్‌ని ఎలా నటించాడో చూడండి!

గ్లోబల్‌ స్టార్‌ రాంచరణ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. యాక్టింగ్‌ స్కూల్‌లో రాంచరణ్‌ ఫస్ట్‌ డే వీడియో అది. రాంచరణ్‌ భిన్నమైన లుక్‌లో చూపిస్తూ, పొడవాటి జుట్టు, క్లీన్ షేవ్ ముఖాన్ని ప్రదర్శిస్తూ, క్లాస్‌మేట్స్ మధ్య నటిస్తున్నాడు.

Ram Charan: పొడవాటి జుట్టు, క్లీన్ షేవ్.. యాక్టింగ్‌ స్కూల్‌లో రాంచరణ్‌ని ఎలా నటించాడో చూడండి!
New Update

రాంచరణ్‌(Ram Charan).. ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌..! మెగాస్టార్‌ తనయుడిగా చిరుతతో ఎంట్రీ ఇచ్చినా తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు చెర్రి. తన నటనతోనే విమర్శకుల మూతి మూయించిన రాంచరణ్‌ ఇప్పుడు తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ అందరిని అలరిస్తున్నారు. అద్భుతమైన డ్యాన్స్‌తో తన తండ్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా రాంచరణ్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై ఆడి పాడుతుంటాడు. కమర్షియల్‌ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు కూడా తీస్తుంటాడు చెర్రి. రెండో సినిమా మగధీరతోనే స్టార్‌డమ్‌ తెచ్చుకున్న ఈ చిరుత.. రంగస్థలంతో మంచి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్‌ఆర్‌లో రాంచరణ్‌ యాక్టింగ్‌ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన రాంచరణ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.



యాక్టింగ్‌ స్కూల్‌లో చెర్రి:

సినిమాల్లోకి రాకముందే చాలామంది లాగే రాంచరణ్‌ కూడా యాక్టింగ్‌ స్కూల్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నారు. ఆ యాక్టింగ్‌ స్కూల్‌లో రాంచరణ్‌ నటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. రాంచరణ్‌ భిన్నమైన లుక్‌లో చూపిస్తూ, పొడవాటి జుట్టు, క్లీన్ షేవ్ ముఖాన్ని ప్రదర్శిస్తూ, క్లాస్‌మేట్స్ మధ్య నటిస్తున్న వీడియో అది. అక్కడ ఉన్నవారిలో కొంతమందికి ఇది సరదాగా అనిపించింది. అటు నెటిజన్లు నుంచి భిన్నరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది రాంచరణ్‌ని ఎగతాళి చేస్తుండగా.. మరికొందరు మాత్రం చెర్రి నటన ఎక్కడ నుంచి ఎక్కడకు వచ్చిందో చూడటానికి ఈ వీడియోనే బెస్ట్ ఎగ్జాంపూల్‌ అని కొనియాడుతున్నారు. 'ఇది నిజమైతే, అతను చాలా దూరం వచ్చాడు బ్రో' అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరొకరు 'ఇప్పుడు అతను గ్లోబల్ స్టార్' అని హైలైట్ చేశాడు.

2022లో విడుదలైన SS రాజమౌళి RRRలో రామ్ తాజాగా కనిపించాడు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, ఒలివియా మోరిస్ ఉన్నారు. ఈ చిత్రంలోని నాటు నాటు అనే పాట గోల్డెన్ గ్లోబ్ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం రాంచరణ్‌ శంకర్ తెలుగు అరంగేట్రం సినిమాలో గేమ్ ఛేంజర్ అనే రాజకీయ డ్రామాను చిత్రీకరిస్తున్నాడు. ఇందులో అతను IAS అధికారిగా నటిస్తున్నాడు. స్టార్-స్టడెడ్ తారాగణం కియారా అద్వానీ, జయరామ్, S.J. సూర్య, సునీల్, నాజర్, ఫిబ్రవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అదనంగా, రామ్ ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు సానా నేతృత్వంలో ఒక ప్రాజెక్ట్‌కు కమిట్ అయ్యాడు.

Also Read: బల్లి మీద పడితే ఇలా చేయండి ? అంతా శుభమే !!

WATCH:

#cinema-news #ram-charan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe