Rakul Preet: అది చూసే జాకీకి పడిపోయా.. లవ్ సీక్రెట్ చెప్పేసిన నటి!

భర్త జాకీ భగ్నానీతో ప్రేమ రహస్యాలను అభిమానులతో పంచుకుంది రకుల్ ప్రీత్ సింగ్. 'జాకీ మంచి మనసు కలిగివుంటాడు. చాలా ఫన్నీగా ఉంటాడు. అతడిలోని కామెడీ టైమింగే నన్ను పడిపోయేలా చేసింది. నిజంగా ఇలాంటి వాడు దొరకడం నేను లక్కీగానే భావిస్తున్నా' అంటూ పార్ట్ నర్ పై ప్రశంసలు కురిపించింది.

Rakul Preet: అది చూసే జాకీకి పడిపోయా.. లవ్ సీక్రెట్ చెప్పేసిన నటి!
New Update

Rakul: యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా మ్యారేజ్ తర్వాత ఫస్ట్ టైమ్ మీడియాతో మాట్లాడిన ఆమె తను కట్టుకున్న జాకీ భగ్నానీ (Jackky Bhagnani) గురించి ఆసక్తికర విసయాలు షేర్ చేసుకుంది.

సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌..
ఈ మేరకు తాజాగా అస్సాం వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాకీ తనకు సెన్స్‌ ఆఫ్‌ హ్యూమర్‌ చాలా ఎక్కువని చెప్పారు. దీంతో పక్కనే ఉన్న రకుల్‌ అది నిజమేనని చెప్పారు. అంతేకాదు భర్తను పొగడ్తలతో ముంచెత్తుతూ.. ‘జాకీ మంచి మనసు కలిగివుంటాడు. చాలా ఫన్నీగా ఉంటాడు. అతడిలోని కామెడీ టైమింగే నన్ను పడిపోయేలా చేసింది. ఎప్పుడూ చూసినా సరదాగా ఉంటాడు. చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండేలా చూస్తాడు. నిజంగా ఇలాంటి వాడు దొరకడం నేను లక్కీగానే భావిస్తున్నా' అంటూ పార్ట్ నర్ పై ప్రశంసలు కురిపించింది.

ఇది కూడా చదవండి: DK Aruna: నాకు ఆ కష్టాలు తప్పలేదు: అరుణ స్పెషల్ ఇంటర్వ్యూ!

కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల పరిచయం..
ఇక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల బాలీవుడ్‌ నిర్మాత జాకీ భగ్నానీతో ఆమెకు పరిచయం ఏర్పడింది. మూడేళ్లు ప్రేమించుకున తర్వాత ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో ఫిబ్రవరి 21న వీరి పెళ్లి జరిగింది. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్స్‌లో జరిగిన వివాహ వేడుకల్లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొని ఘనంగా జరిపించారు.

#rakul-preet-singh #jackie-bhagnani #shared-love-secrets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe