Rakul Preet: హైద‌రాబాద్‌లో ‘ఆరంభం’.. మరో బిజినెస్ మొదలుపెడుతున్న రకుల్!

స్టార్ నటి రకుల్‌ ప్రీత్ సింగ్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. హైద‌రాబాద్‌ మాదాపూర్ లో ఏప్రిల్ 16న ‘ఆరంభం’ పేరుతో ఓ వెజ్ రెస్టారెంట్‌ను ప్రారంభించ‌బోతున్నట్లు సమాచారం. ఇప్పటికే F-45 పేరుతో జిమ్‌లు, వెల్ బీయింగ్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో పార్ట్ నర్ గా ఉంది.

New Update
Rakul Preet: హైద‌రాబాద్‌లో ‘ఆరంభం’.. మరో బిజినెస్ మొదలుపెడుతున్న రకుల్!

Rakul Preet Singh Food Business in Hyderabad: స్టార్ నటి రకుల్‌ ప్రీత్ సింగ్ మరో బిజినెస్ మొదలుపెట్టబోతుంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫిట్‌నెస్, తదితర వ్యాపారాల్లోనూ సత్తా చాటుతున్న ఈ అమ్మడు తాజాగా హైదరాబాద్ వేదికగా ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: Vindhya: స్టేజ్‌పై బట్టలు మార్చుకోవడం నా వల్ల కాలేదు.. అయినా తప్పలేదు!

‘ఆరంభం’ పేరుతో ఓ వెజ్ రెస్టారెంట్‌..
ఈ మేరకు హైద‌రాబాద్‌లో ‘ఆరంభం’ (Armbham) పేరుతో ఓ వెజ్ రెస్టారెంట్‌ను ప్రారంభించ‌బోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మాదాపూర్‌లో ఈ నెల 16న ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయనుందని, ఇందులో మిల్లెట్స్‌తో చేసిన వంట‌కాలు ల‌భించ‌నున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం. దీనిపై ర‌కుల్ కూడా అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే.. ఇప్పటికే హైద‌రాబాద్‌, వైజాగ్‌ల‌లో F-45 పేరుతో జిమ్‌ల‌ను ఏర్పాటు చేసింది రకుల్. వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్ నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లో ర‌కుల్‌కు పార్ట్‌న‌ర్‌షిప్ ఉంది.

Advertisment
తాజా కథనాలు