Raksha Bandhan 2024 : చరిత్రలో భార్య భర్తలు (Wife & Husband) విడిపోయారేమో కానీ.. అన్నా చెల్లెలు (Brother & Sister) విడిపోయినట్లు చరిత్రలోనే లేదు.. ఇది ఓ తెలుగు సినిమాలో అందరినీ కన్నీటిని పెట్టించిన డైలాగ్ ఇది. కేవలం ఈ ఒక్క సినిమాలోనే కాదు అనేక తెలుగు చిత్రాల్లో అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ సూపర్ గా వర్క్ ఔట్ అయ్యింది. పాత తరం హీరోలే కాదు నేటి కుర్ర హీరోల వరకు అనేక మంది అన్న పాత్రలో ఆకట్టుకున్నారు. అన్న అంటే ఇలా ఉండాలన్నట్లుగా వారి పాత్రలను మలిచారు మన దర్శకులు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచి.. విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రాల వివరాలు మీకోసం..
రాఖీ (Rakhi) :
ఈ సినిమాలో చెల్లికి అన్యాయం జరిగితే ఒక అన్న ఎంతకైనా తెగించగలడు, ఎవరినైనా ఎదిరించగలడు అని చూపించాడు డైరెక్టర్ కృష్ణవంశీ. చెల్లికి కష్టం వస్తే అన్న పెట్టే కన్నీళ్లు, చెల్లి కోసం అన్న చేసే త్యాగాలను చూపించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది ఈ రాఖీ.
శీను వాసంతి లక్ష్మి
ఈ చిత్రంలో ఆర్ఫీ పట్నాయక్ (RP Patnaik) సెంటిమెంట్ కన్నీళ్లు పెట్టించింది. అంధుడైన అన్న చెల్లిని కంటికి రెప్పలా ఎలా కాపాడుకుండు. అలాగే చెల్లికి జరిగిన ఘోరానికి ఎలా ఎదురుతిరిగాడు? అనే పాయింట్ తో వచ్చిన ఈ మూవీ.. అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని గొప్పగా చూపించింది.
ఒరేయ్ రిక్షా
1995 లో అన్నాచెల్లెల్లి అనుబంధంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చెల్లెలి జీవితమే తన జీవితంగా భావించిన అన్న.. చెల్లికి అన్యాయం చేసిన వారిపై ఎలా ఎదురుతిరిగాడు? అనే నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయింది. ఈ సినిమాలోని నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ.. పాట ఎప్పటికీ సూపర్ హిట్టే..
హిట్లర్
మెగాస్టార్ నటించిన బ్లాక్ బస్టర్ అన్నా చెల్లెల్ల సినిమా హిట్లర్. అన్న ఒక తండ్రి స్థానంలో ఐదుగురి చెల్లెల్ల బాధ్యతను భుజాన వేసుకొని.. చెల్లెల్లే తన లోకంగా ఎలా బతికాడు, చివరికి వారి చేతిలోనే మోసపోయినప్పటికీ చివరి వరకు చెల్లెళ్ళ కోసం పరితపిస్తూ చిరంజీవి హిట్లర్ పాత్రలో పంచిన నిస్వార్థమైన ప్రేమ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
బంగారు గాజులు
ఈ సినిమాలో చెల్లి కోసం పరితపించే అన్నగా అక్కినేని నాగేశ్వర్ రావు (Akkineni Nageswara Rao) పరితపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిది.. అనే సాంగ్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
Also Read: Prabhas : ప్రభాస్ – హను రాఘవపూడి మూవీ నుంచి పోస్టర్ రిలీజ్.. కాన్సెప్ట్ అదిరిపోయిందిగా!