Raksha Bandhan 2025: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి? రాఖీ తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు. అయితే చాలా మంది రాఖీ కట్టిన ఒకటి, రెండు రోజులకే తీసేస్తుంటారు. ఇలా చేయడం అశుభమని పండితులు సూచిస్తున్నారు. రాఖీని కనీసం 21 రోజులు ఉంచుకోవాలట. లేదంటే రాఖీ తర్వాత వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకైనా ఉంచుకోవాలి.

author-image
By Archana
New Update
Raksha Bandhan 2024: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి? రాఖీ తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
Raksha Bandhan 2025అన్నాచెల్లళ్ళ, అక్కా తమ్ముళ్ళ ప్రేమకు, అనుబంధానికి చిహ్నంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున రాఖీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 09న రక్షాబంధన్ జరుపుకున్నారు. అయితే తోబుట్టువుల తమ అక్కాచెల్లెళ్ళు రాఖీ కట్టిన తర్వాత ఒకటి, రెండు రోజులకే వాటిని తీసేస్తుంటారు. ఇలా చేయడం అశుభమని సూచిస్తున్నారు పండితులు. రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఉంచుకోవాలి..? రాఖీని తీసిన తర్వాత ఎక్కడ పడేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము..

రాఖీని ఎన్ని రోజులు చేతికి ఉంచుకోవాలి

విశ్వసాల ప్రకారం.. రక్షాబంధన్ తర్వాత రాఖీని వెంటనే తీసేయకూడదు. కనీసం 21 రోజులు చేతికి ఉంచుకోవాలి. లేదంటే రాఖీ తర్వాత వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా సోదరి కట్టిన రాఖీని ఉంచుకోవాలని చెబుతున్నారు

publive-image

రాఖీని తీసిన తర్వాత ఏం చేయాలి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చేయి నుంచి రాఖీని తీసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దానిని ఎర్రటి గుడ్డలో కట్టి పవిత్ర స్థలంలో ఉంచాలి. మళ్ళీ వచ్చే ఏడాది రాఖీ పండగ వరకు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్రవహిస్తున్న నదిలో వదిలేయండి. ఒకవేళ రాఖీ విరిగిపోతే దానిని ఒక రూపాయి నాణెంతో చెట్టు మూలాల దగ్గర పాతిపెట్టండి.

Also Read: Raksha Bandhan : రాఖీ కట్టే సమయంలో ఏ వైపు కూర్చోవాలో తెలుసా? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు