Raksha Bandhan 2025: రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది?

ఈ ఏడాది ఆగస్టు 09న రాఖీ పౌర్ణమి వచ్చింది. అయితే.. ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 1.32 గంటల వరకు రాఖీ కట్టడం అంత మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 2:07 గంటల నుంచి రాత్రి 08:00 గంటల వరకు మహిళలు తమ సోదరులకు రాఖీ కట్టాలని సూచిస్తున్నారు.

author-image
By Vijaya Nimma
New Update
Raksha Bandhan : రాఖీ కట్టడానికి సరైన సమయం ఏది?

Raksha Bandhan 2025

Raksha Bandhan 2025:రక్షాబంధన్ (Raksha Bandhan) అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమకు ప్రతీకగా ఉండే పండుగ. ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో వస్తుంది. రాఖీ రోజున సోదరీమణులు సోదరుడి రాఖీ కట్టి అతని ఉజ్వల భవిష్యత్తును కోరుకుంటారు. రాఖీ (Rakhi) కట్టిన తర్వాత సోదరుడు సోదరికి ఎల్లప్పుడూ రక్షిస్తానని హామీ ఇస్తాడు. ఈ సంవత్సరం రక్షాబంధన్ 19 ఆగస్టు 2024న జరుపుకుంటారు. అన్నాచెల్లెళ్ల మధ్య బంధం (Brother & Sister Relationship) చెక్కు చెదరకుండా ఉండాలంటే శుభ ముహూర్తంలో మాత్రమే రాఖీ కట్టాలి. ఈ ఏడాది రక్షాబంధన్‌పై భద్ర ఛాయలు కమ్ముకుంటున్నాయి. ఏ శుభ ముహూర్తంలో రాఖీ కట్టాలి. భద్ర ఎంతకాలం ఉంటుందో తెలుసుకోవాలి. దాని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

రక్షాబంధన్ తేదీ:

  • పంచాంగ్ ప్రకారం.. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 09 ప్రారంభమవుతుంది. ఈ తేదీ ఆగస్టు 09 రాత్రి 11:55 గంటలకు ముగుస్తుంది. శ్రావణ పూర్ణిమ నాడు రక్షాబంధన్ జరుపుకుంటారు.

అనుకూల సమయం:

  • ఈ సంవత్సరం రక్షాబంధన్ నాడు ఆగస్ట్ 09న మధ్యాహ్నం 2:07 నుంచి రాత్రి 08:20 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ప్రదోష కాలంలో సాయంత్రం 06.57 నుంచి 09.10 గంటల వరకు రాఖీ కట్టడం శుభప్రదం. అయితే రక్షాబంధన్ పండుగను ఉదయం పూట జరుపుకునే వారు ఈ సారి ఉదయం నుంచి మధ్యాహ్నం 01.32 గంటల వరకు రాఖీ కట్టలేరు. ఈ సమయంలో భద్రుడు ఉంటాడు.

భద్రకాలం ఎప్పటి వరకు ఉంటుంది:

  • రక్షాబంధన్ నాడు ఉదయం 5:53 గంటలకు భద్ర ప్రారంభ సమయం. ఆ తర్వాత మధ్యాహ్నం 1:32 వరకు కొనసాగుతుంది. ఈ భద్ర పాతాళలోకంలో ఉంటాడు. రక్షాబంధన్ సమయంలో రాఖీ కట్టే ముందు భద్ర కాలాన్ని ఖచ్చితంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది అశుభకరమైనదిగా చెబుతారు.

భద్రలో రాఖీ కట్టడం అశుభం:

  • మత గ్రంథాల ప్రకారం.. రక్షాబంధన్ పండుగను భద్రకాలంలో జరుపుకోకూడదు అనేది భద్ర కాలంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. పురాణాల ప్రకారం.. భద్ర కాలంలో లంక పాలకుడు రావణుడికి అతని సోదరి రాఖీ కట్టింది. అదే సంవత్సరంలో రాముడి చేతిలో రావణుడు చంపబడ్డాడు. అందుకే భద్ర కాలంలో రాఖీ కట్టరని పురాణాలు చెబుతున్నారు.

రక్షాబంధన్ ప్రాముఖ్యత:

  • ప్రతికూలత, దురదృష్టం నుంచి రక్షించడానికి రక్షాబంధన్ ముడిపడి ఉంది. రక్షాబంధన్ ధరించిన వారి ఆలోచనలు సానుకూలంగా, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. రక్షాబంధన్ ఇప్పుడు రాఖీ రూపంలోకి వచ్చినప్పటికీ దాని ఉద్దేశ్యం అన్నాచెల్లెళ్ల బంధాన్ని బలంగా ఉంచుతుందని నమ్ముతారు.

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

ఇది కూడా చదవండి: ఈ వంటకం శాకాహారులకు ప్రత్యేకమైనది.. ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు