Raksha Bandhan 2024 : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి (Brother & Sister Relationship), ప్రేమకు ప్రతీకగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ రక్షా బంధన్ (Raksha Bandhan). ఈ పండుగను ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ అన్నాతమ్ముళ్లకు శుభం కలగాలని కోరుకుంటూ రక్షా బంధనాన్ని చేతికి కడతారు. ఈ సంవత్సరం రాఖీ (Rakhi) ఆగస్టు 19వ తేదీ సోమవారం వచ్చింది.
రాఖీ కట్టడానికి మధ్యాహ్నం 01:25 నుంచి 09:36 వరకు మంచి సమయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే రాఖీ కట్టేటప్పుడు సోదరుడు ఏ దిశలో కూర్చుంటే మంచిది..? ఏ చేతికి రాఖీ కట్టాలి..? అనే ప్రశ్నలు చాలా మంది మదిలో ఉంటాయి. వాటికి సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాము..
రాఖీ కట్టే సమయంలో ముఖాన్ని ఏ దిశలో ఉంచాలి..?
సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు సరైన దిశలో కూర్చోవడం చాలా ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల అక్కాతమ్ముళ్ళు, అన్నాచెల్లెళ్లు ఇద్దరూ శుభఫలితాలు పొందుతారు. రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం తూర్పు దిశలో, సోదరి ముఖం పడమర దిశలో ఉండాలని గుర్తుంచుకోండి. దీన్ని ఉత్తమంగా భావిస్తారు.
ఏ చేతికి రాఖీ కట్టాలి..?
జ్యోతిషశాస్త్రం ప్రకారం సోదరుడి కుడిచేతికి రాఖీ కట్టాలి. కుడి చేయి కర్మలతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ చేతికి రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు. సోదరుడి నుదుటిపై తిలకం, గంధం, రోలి, అక్షత్ పూసిన తర్వాత కుడిచేతిలో రాఖీ కట్టాలి. అలాగే సోదరుడి నుదుటిపై తిలకం, అక్షింతలు వేసిన తర్వాతే రాఖీ కట్టాలి.
Also Read: Raksha Bandhan: భర్తకు భార్య రాఖీ కొట్టొచ్చా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే? - Rtvlive.com