Raju Yadav : బాలీవుడ్ కు వెళ్తున్న'రాజు యాదవ్'.. గెటప్ శ్రీను ప్లేస్ లో స్టార్ హీరోతో రీమేక్?

గెటప్ శ్రీను హీరోగా నటించిన 'రాజు యాదవ్' సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందంటూ ఓ వార్త బయటికొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావ్ ఇటీవలే ఈ సినిమా చూసాడట. ఆ సినిమా అతనికి బాగా నచ్చడంతో ఈ రీమేక్ చేద్దామనుకుంటున్నాడని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.

New Update
Raju Yadav : బాలీవుడ్ కు వెళ్తున్న'రాజు యాదవ్'.. గెటప్ శ్రీను ప్లేస్ లో స్టార్ హీరోతో రీమేక్?

Raju Yadav Movie Going To Remake In Bollywood : జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా మారుతూ నటించిన సినిమా 'రాజు యాదవ్'. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమా యావరేజ్ గా ఆడినా చిన్న బడ్జెట్ సినిమా కావడం, గెటప్ శ్రీను యాక్టింగ్ వల్ల కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది. కొత్త దర్శకుడు కృష్ణమాచారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అంకిత ఖారత్ హీరోయిన్ గా నటించింది.

క్రికెట్ ఆడుతున్నప్పుడు మూతి మీద బాల్ తగిలి లైఫ్ లాంగ్ నవ్వుతూ ఉండేలా హీరో ఫేస్ మారిపోతుంది. ఆపరేషన్ చేయిస్తే మాములుగా మారుతుంది కానీ డబ్బుల్లేక అలా వదిలేయడంతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అతని నవ్వు వల్ల వచ్చిన సమస్యలు, ఆ నవ్వు వల్ల వచ్చే లవ్ స్టోరీ, ఆ తర్వాత అయ్యే బ్రేకప్.. ఇలా మాములు లవ్ కమర్షియల్ కథకి కొత్త కథనంతో చూపించారు. ఈ సినిమా క్లైమాక్స్ హైలెట్.

Also Read : నా సినిమాలు ప్లాప్ అవుతుంటే అది చూసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు : అక్షయ్ కుమార్

గెటప్ శ్రీను యాక్టింగ్ కూడా హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందంటూ ఓ వార్త బయటికొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావ్ ఇటీవలే ఈ సినిమా చూసాడట. ఆ సినిమా అతనికి బాగా నచ్చడంతోఈ రీమేక్ చేద్దామనుకుంటున్నాడని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. మాములుగా రాజ్ కుమార్ రావు ఎక్కువగా ప్రయోగాత్మక సినిమాలే చేస్తాడు.

ఇటీవలే 'శ్రీకాంత్' అనే సినిమాలో అంధుడి పాత్రలో కూడా నటించి మెప్పించాడు. రాజు యాదవ్ సినిమాలో గెటప్ శ్రీను నవ్వుతూనే ఉంటూ అన్ని రకాల ఎమోషన్స్ చూపించడం రాజ్ కుమార్ రావు కి నచ్చి తాను కూడా ఆ ప్రయోగం చేయాలనుకుంటున్నాడట. ఇదే కనుక నిజమైతే బాలీవుడ్ లో ఈ మూవీకి మంచి ఆదరణ లభించే అవకాశం ఉందని చెప్పొచ్చు.

Advertisment
తాజా కథనాలు