Rajinikanth : వామ్మో.. 'కూలీ' కోసం రజినీకాంత్ రెమ్యునరేషన్ వందల కోట్లా?

సినిమా కోసం రజినికాంత్ ఏకంగా 260 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త కోలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు ఇండియాలోనే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ని అందుకున్న హీరో ఎవరూ లేరు. ఈ అరుదైన ఘనత సూపర్ స్టార్ కి మాత్రమే సాధ్యమైంది.

New Update
Rajinikanth : వామ్మో.. 'కూలీ' కోసం రజినీకాంత్ రెమ్యునరేషన్ వందల కోట్లా?

Rajinikanth Remuneration For Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'కూలీ'(Coolie). గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతోందని టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో తోనే చెప్పేశారు మేకర్స్. రజినీకాంత్ కెరీర్లో 171 వ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం రజినీకాంత్ అందుకుంటున్న రెమ్యునరేషన్ వివరాలు తాజాగా బయటికి వచ్చాయి.

రజినీకాంత్ రికార్డ్ రెమ్యునరేషన్

'కూలీ' సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, వీడియో గ్లింప్స్ ని బట్టి లోకేష్ కనగరాజ్ ఈసారి రజినీకాంత్ ని వెండితెరపై సరికొత్తగా చూపించబోతున్నట్టు అర్థం అవుతుంది. కాగా ఈ సినిమా కోసం రజినికాంత్ ఏకంగా 260 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ఓ వార్త కోలీవుడ్(Kollywood) సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఒక్క సినిమాకే 260 కోట్ల రెమ్యునరేషన్ అంటే అది మాములు విషయం కాదు. ఇప్పటివరకు ఇండియాలోనే ఈ రేంజ్ రెమ్యునరేషన్ ని అందుకున్న హీరో ఎవరూ లేరు. ఈ అరుదైన ఘనత సూపర్ స్టార్ కి మాత్రమే సాధ్యమైంది. రజినీకాంత్ తో పాటూ దర్శకుడు లోకేష్ కనగరాజ్ సైతం 60 కోట్ల వరకు పారితోషకం అందుకున్నట్లు తెలుస్తుంది.

కీలక పాత్రలో శృతి హాసన్

'కూలీ' మూవీలో స్టార్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Hassan) ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. సినిమాలో ఆమె రజినీకాంత్ కూతురిగా కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. శృతి హాసన్ తో పాటూ బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ సైతం గెస్ట్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2025 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : భయంకరమైన బాక్ ట్రైలర్.. అదరగొట్టేసిన తమన్నా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు