Rajinikanth Craze in Japan : జపాన్ లో రజనీకి క్రేజ్

జపాన్ లో రజనీ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. భారతదేశంలో విడుదలయిన ప్రతి రజనీ సినిమాను జపనీయులు ఆదరిస్తూంటారు. రజనీ సినిమా విడుదలయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. ఈలలు, కేకలతో అక్కడ సందడి నెలకొని ఉంటుంది. రజనీ నటించిన భాషా, ముత్తు సినిమాలంటే అక్కడ వాళ్లకు పిచ్చి ఇష్టం. జపాన్ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రం రికార్డు రెండు దశాబ్దాలుగా రజనీకి చెందిన ముత్తుకే ఉంది.

New Update
Rajinikanth Craze in Japan : జపాన్ లో రజనీకి క్రేజ్

Rajinikanth Craze in Japan: జపాన్ లో రజనీ సినిమాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. భారతదేశంలో విడుదలయిన ప్రతి రజనీ సినిమాను జపనీయులు ఆదరిస్తూంటారు. రజనీ సినిమా విడుదలయితే థియేటర్లు కిక్కిరిసిపోతాయి. ఈలలు, కేకలతో అక్కడ సందడి నెలకొని ఉంటుంది. రజనీ నటించిన భాషా, ముత్తు సినిమాలంటే అక్కడ వాళ్లకు పిచ్చి ఇష్టం. జపాన్ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన భారతీయ చిత్రం రికార్డు రెండు దశాబ్దాలుగా రజనీకి చెందిన ముత్తుకే ఉంది. (ఇటీవల ఆ రికార్డును త్రిబుల్ ఆర్ బ్రేక్ చేసింది. అది వేరే విషయం). 2019లో విడుదలయిన ముత్తు చిత్రం 400 మిలియన్‌ జపాన్ యెన్ లు వసూలు చేసింది.

ఇప్పుడు జైలర్ చిత్రం విడుదల కోసం జపాన్ వాసులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. అక్కడ విడుదలయ్యేదాకా ఎదురుచూడటం ఇష్టం లేని కొందరు అభిమానులు తమిళనాడు వచ్చి మరీ సినిమా చూస్తున్నారు. జపాన్ లో రజనీ ఫ్యాన్ క్లబ్ లీడర్ యసుదా హైడ్ తోషి చెన్నై వచ్చి ఈ సినిమా మొదటి ఆట చూసి తెగ సంబరపడిపోయారు.

Also Read:  “జైలర్” ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్ ఏం అంటున్నారంటే…!!

Advertisment
Advertisment
తాజా కథనాలు