TDP : టీడీపీకి బత్యాల గుడ్‌ బై... టికెట్‌ రాకపోవడంతో నిర్ణయం!

మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు టీడీపీకి రాజీనామా చేసినట్లు శనివారం ఉదయం ప్రకటించారు. తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. టికెట్‌ రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

New Update
TDP : టీడీపీకి బత్యాల గుడ్‌ బై... టికెట్‌ రాకపోవడంతో నిర్ణయం!

Bathyala : అన్నమమ్య జిల్లా రాజంపేటలో(Rajampet)  రాజకీయ పోరు మొదలైంది. టీడీపీ(TDP) కి మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు(Bathyala Changal Rayudu) రాజీనామా చేసినట్లు శనివారం ఉదయం ప్రకటించారు. శనివారం ఉదయం తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. బత్యాల రాజంపేట నుంచి టీడీపీ టికెట్‌ వస్తుందని ఆశపడ్డారు.

కానీ ఆయనకు టికెట్‌ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బత్యాల పార్టీ పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టికెట్‌ రాకపోవడంతో పాటు టీడీపీ సుగవాసి సుబ్రహ్మణ్యాన్ని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. బత్యాల అనుచరులు టీడీపీ జెండాలు తగలబెట్టి నిరసన తెలిపారు. టీడీపీ అధినేత తమ నేతను నమ్మించి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బత్యాలకు టికెట్‌ ఖరారు చేయకపోవడంతో అనుచరులు మనస్థాపం చెందారు. పెట్రోల్ పోసుకుని, మిద్దెక్కి ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించగా... వారిని కార్యకర్తలు, నేతలు అడ్డుకున్నారు.

Also Read : నల్లమిల్లికి సీటు ఇవ్వాలని ముగ్గురు ఆత్మహత్యాయత్నం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు