Rajamouli : జక్కన్న డైరెక్షన్ లో వార్నర్ యాక్టింగ్.. వీడియో చూస్తే నవ్వలేక చస్తారు!

దర్శకధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ సోషల్ మీడియా స్టార్ డేవిడ్ వార్నర్‌లకు సంబంధించి ఓ సరదా వీడియో ఇంటర్ నెట్ ను కుదిపేస్తోంది. వీరిద్దరి కలయికలో 'క్రెడ్ యాప్' (CRED) ప్రచారం కోసం చిత్రీకరించిన వీడియో నవ్వులు పూయిస్తోంది. దీనిపై ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.

Rajamouli : జక్కన్న డైరెక్షన్ లో వార్నర్ యాక్టింగ్.. వీడియో చూస్తే నవ్వలేక చస్తారు!
New Update

Rajamouli - David Warner: దర్శకధీరుడు రాజమౌళి, ఆస్ట్రేలియా క్రికెటర్ అండ్ సోషల్ మీడియా స్టార్ డేవిడ్ వార్నర్‌లకు సంబంధించి ఓ సరదా వీడియో ఇంటర్ నెట్ ను కుదిపేస్తోంది. వీరిద్దరి కలయికలో 'క్రెడ్ యాప్' (CRED) ప్రచారం కోసం సదరు కంపెనీ నిర్వాహకులు ఫన్నీ వీడియో చిత్రీకరించగా జనాలకు నవ్వులు పూయిస్తోంది. అంతేకాదు ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేస్తూ వార్నర్ ఆసక్తికర క్యాప్షన్ ఇవ్వడం విశేషం.

ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దాం..

ఈ మేరకు 'నీ మ్యాచ్ టికెట్ల మీద డిస్కౌంట్ ఏమైనా ఉందా? అని రాజమౌళి వార్నర్ ను అడుగుతాడు. దీంతో 'క్రెడ్ యాప్ ఉందా? ఉంటే క్యాష్ బ్యాక్ వస్తుంది' అని వార్నర్ రిప్లై చెబుతాడు. ఈ క్రమంలో 'లేకపోతే ఏం చేయాలి?' అని రాజమౌళి అడుగుతాడు. దీంతో లేకపోతే డిస్కౌంట్ కోసం నువ్వు నాకు ఫేవర్ చేసి పెట్టాల్సి ఉంటుందని వార్నర్ అనడంతో రాజమౌళి డ్రీమ్స్‌లోకి వెళ్లడంతో ఈ యాడ్ మొదలవుతుంది. రాజమౌళి సినిమా తీస్తున్నట్టు.. ఒక్కో షాట్, ఒక్కో ఎమోషన్, ఒక్కో స్టెప్‌ని డెవిడ్ వార్నర్ కూనీ చేయడం చూసి రాజమౌళి తలపట్టుకుంటాడు. వార్నర్ తన నటనకు ఆస్కార్ వస్తుందని, ఆస్కార్ స్టేజ్ మీద కలుద్దామని అంటాడు. దీంతో రాజమౌళి ఓ చూపు చూస్తాడు. ఇక ఇలాంటి రాజమౌళిని డేవిడ్ దారుణంగా హింసిస్తుంటాడు. చివరా కలలోంచి తేరుకుని క్రెడ్ యాప్‌ డౌన్ లోడ్ చేసుకుని పేమెంట్ చేసేస్తా అంటూ రాజమౌళి చెబుతాడు.

అయితే ఈ ప్రకటనకు సంబంధిచిన వీడియోలో ఫుల్ కామెడీ ఉండగా జనాలు పడిపడి నవ్వుతున్నారు. డెవిడ్ వార్నర్ అంటే క్రికెటర్ అనుకుంటున్నారా? యాక్టర్ అంటూ.. డెవిడ్ తన ఇన్ స్టాలో ఈ యాడ్‌ను పోస్ట్ చేయడంపై కూడా ఫన్నీ మీమ్స్ పేలుతున్నాయి.

#david-warner #rajamouli #cred-app-video
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe