మళ్లీ సొంతగూటికి రాజగోపాల్‌రెడ్డి

రాబోయే ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచే పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ…మునుగోడులో యుద్ధం పూర్తి కాలేదన్నారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధర్మంగా గెలిచిందన్నారు. రానున్న రోజుల్లో మరో ధర్మ యుద్ధం ఉంటుందన్నారు. ఈసారీ పోటీ చేసి…మునుగోడు నుంచి గెలిచి తీరుతానని రాజగోపాల్‌రెడ్డి అన్నారు.  

New Update
మళ్లీ సొంతగూటికి రాజగోపాల్‌రెడ్డి

Rajagopal Reddy is contesting as a Congress candidate

కొత్త జోష్ పెంచిన టీకాంగ్రెస్‌

తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీకాంగ్రెస్‌లో కొత్త జోష్ తెస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఆదరణ లేదని పార్టీ వీడిన నేతలు తిరిగి ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీజేపీ వర్సస్ బీఆర్ఎస్‌గా మారిన తెలంగాణ పొలిటికల్ గేమ్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంటోంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కొత్త కండీషన్లు పెట్టినట్లు సమాచారం.

ఆ రెండూ పార్టీ ఒక్కటే..

కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి, ఎక్కడ పోగొట్టుకున్నాను అక్కడే గెలుచుకుంటా రాజగోపాల్‌రెడ్డి సవాల్ విసిరారు. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి సీఎం కేసీఆర్‌కు నేనేంటో చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాలో 12 స్థానాలు గెలవడమే కోమటిరెడ్డి బ్రదర్స్ లక్ష్యం మని, ఎల్బీనగర్, భువనగిరి నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదన ఉన్నా.. ఈసారి మునుగోడు నుంచి బరిలోకి దిగుతానని రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటే అని, అందుకే నేను పార్టీ మారుతున్న రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.

రేవంత్‌రెడ్డికి షరతులు

తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రత్యేక ఆకర్షణ. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. బీజేపీలో చేరి మునుగోడు నుంచి పోటీ చేశారు. హోరా హోరీగా సాగిన ఆ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నా అంత యాక్టివ్‌గా లేరనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో సోదరుడు ఎంపీ కోమటిరెడ్డిపైన పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. కానీ, ఉప ఎన్నికల ప్రచారానికి వెంకటరెడ్డి దూరంగా ఉన్నారు. రేవంత్‌రెడ్డి పైన ఇద్దరు సోదరులు ఫైర్ అయ్యారు. ఆ తరువాత రాజగోపాల్‌రెడ్డి ఓటమి, రాష్ట్ర కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జ్ రావటంతో పరిస్థితుల్లో మార్పు కనిపించింది.

కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీకి సీట్లు

ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ బీజేపీలో ఆశించిన విధంగా పరిస్థితులు కనిపించటం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల ముఖ్య నేతలెవరూ బీజేపీలో చేరే అవకాశం లేదనే చర్చ వారి మధ్య జరిగినట్లు చెబుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 175 సీట్ల కంటే ఎక్కువ రావని రాజగోపాల్‌ అభిప్రాయంగా తెలుస్తోంది. గుజరాత్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌లోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని, మిగతా చోట్ల అంతగా ప్రభావం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, తిరిగి పార్టీ మారితే నియోజకవర్గంలో ప్రజల్లో వచ్చే స్పందనపైనా చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు