Malavika Mohanan : ప్రభాస్ 'రాజా సాబ్' సెట్స్ లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. నెట్టింట ఫొటోలు వైరల్

'రాజా సాబ్‌’ సెట్స్‌లో హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ బర్త్‌డే ఘనంగా జరిగింది. ఆగస్టు 4న మాళవిక బర్త్ డే కావడంతో రాజా సాబ్‌ యూనిట్‌ సభ్యులు సెట్స్ లో ఆమెతో కేక్‌ కట్‌ చేయించి, బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా సెట్స్‌లో తీసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

New Update
Malavika Mohanan : ప్రభాస్ 'రాజా సాబ్' సెట్స్ లో హీరోయిన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. నెట్టింట ఫొటోలు వైరల్

Actress Malavika Mohanan : ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్‌’ సినిమా సెట్స్‌లో మరోసారి సంబరాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న మాళవిక మోహనన్‌ బర్త్‌డేను సెట్స్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఆగస్టు 4న మాళవిక బర్త్ డే కావడంతో రాజా సాబ్‌ యూనిట్‌ సభ్యులు సెట్స్ లో ఆమెతో కేక్‌ కట్‌ చేయించి, బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఈ సందర్భంగా సెట్స్‌లో తీసిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో మారుతితో పాటూ మూవీ టీమ్ అంతా భాగమవ్వగా.. ఇందులో డార్లింగ్ ప్రభాస్ ఒక్కరే మిస్ అయ్యారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ ఫొటోల్లో ప్రభాస్ కనిపించకపోయే సరికి కాస్త నిరాశ చెందారు. కాగా ప్రభాస్‌, మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read : అవార్డ్స్ పై నాకు పెద్దగా ఆసక్తి లేదు.. నాని షాకింగ్ కామెంట్స్..!

ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమాలో మాళవిక మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్ హెరౌన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా రొమాంటిక్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో సాగనుంది. 2025 ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. .

Advertisment
తాజా కథనాలు