Raj Tarun : రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా మెసేజ్‌ చాట్స్‌ లీక్‌.. బయటపడ్డ రహస్యాలు!

రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ అయ్యాయి. ఇందులో పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2023లో మాల్వీకి రాజ్‌తరుణ్‌ లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. ఇద్దరూ వీడియో కాల్స్‌, చాటింగ్స్‌ చేసుకున్నారు. చాటింగ్ ఫొటోల్లో గంజాయి కూడా కనిపించడం గమనార్హంగా మారింది.

New Update
Raj Tarun : రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా మెసేజ్‌ చాట్స్‌ లీక్‌.. బయటపడ్డ రహస్యాలు!

Raj Tarun - Malvi Malhothra Chats Leak : టాలీవుడ్ యంగ్ హీరో - లావణ్య ప్రేమ వ్యవహారం ఇండస్ట్రీలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. లావణ్య ఇప్పటికే ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. అయితే తాజాగా ఈ కేసులో భాగంగా హీరో రాజ్‌తరుణ్‌, మాల్వీ మల్హోత్రా మెసేజ్‌ చాట్స్‌ లీక్‌ అయ్యాయి. ఇందులో పలు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 2023లో మాల్వీ మల్హోత్రాకు రాజ్‌తరుణ్‌ లవ్‌ ప్రపోజ్‌ చేశాడు.

రాజ్‌తరుణ్ నుండి ప్రపోజ్‌ వచ్చిన వెంటనే మాల్వీ ఓకే చెప్పింది. దాంతో ఈ ఇద్దరూ సీక్రెట్ రిలేషన్ షిప్ స్టార్ట్ చేశారు. ఇద్దరూ వీడియో కాల్స్‌, చాటింగ్స్‌ చేసుకున్నారు. తాజాగా బయటకొచ్చిన చాటింగ్స్‌ ఫొటోల్లో గంజాయి కూడా కనిపించడం గమనార్హంగా మారింది. పర్సనల్‌ వ్యవహారాలపైనా ఇద్దరూ పలుమార్లు చాట్ చేసుకున్నారు.

Also Read : చైతూ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘తండేల్’ వాయిదా?

ప్రస్తుతం వీరిద్దరి చాటింగ్ లీక్స్ రూపంలో బయటికి రావడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంపై రాజ్‌తరుణ్‌ తండ్రితో RTV ప్రతినిధి మాట్లాడటం జరిగింది. ఈ సంభాషణలో రాజ్‌‌తరుణ్‌ తండ్రి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు.రాజ్‌తరుణ్‌, లావణ్యల సహజీవనం వాస్తవమేనని, కానీ పెళ్లి మాట మాత్రం అబద్ధం అని, మమ్మల్ని లావణ్య సరిగా చూసుకునేది కాదని అన్నారు.

Advertisment
తాజా కథనాలు