/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-16-1.jpg)
Malvi Malhotra: టాలీవుడ్ యువ నటుడు రాజ్‌తరుణ్ లవ్ వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్ తనను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని చివరికి మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకున్నాడంటూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా లావణ్య ఆరోపణలపై స్పందించిన మల్హోత్రా.. లావణ్య చెప్పేవన్నీ అబద్దాలేనని కొట్టిపారేసింది.
ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన మల్హోత్రా.. లావణ్య ఆరోపించినట్లు రాజ్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు. అతడు సహనటుడు మాత్రమే. లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. నన్ను మాత్రమే కాకుండా రాజ్‌తరుణ్‌తో సినిమాలో నటించిన ప్రతి హీరోయిన్‌ను లావణ్య అనుమానిస్తోంది. లావణ్య నాకు మేసేజ్‌లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోంది. నా పేరెంట్స్ కు కూడా ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టిందని వాపోయింది.
Melting Love & Thumping Action 👊❤️
The Teaser of Romantic Action Entertainer #TiragabadaraSaami has just hit the YouTube 💥
⭐ing @itsRajTarun @MalviMalhotra
A #ASRavikumarChowdhary Film #MalkapuramShivakumar #JB #SurakshEntertainments @adityamusic pic.twitter.com/AIZcJOjJG9
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) August 28, 2023
అలాగే లావణ్యతో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పింది. మేము ఆమెను బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవం. గత 6 నెలలుగా నేను రాజ్‌తరుణ్‌తో టచ్‌లోలేను. ‘తిరగబడరా సామీ’ సినిమా ప్రమోషన్ కోసం రీసెంట్‌గా మాట్లాడాను. ఆ అనుమానంతో లావణ్య మెసేజ్‌లు చేస్తోంది. లావణ్య నాపై అసత్య ప్రచారం చేస్తోంది. ఆమెపై పోలీసులకు కంప్లైంట్ చేస్తానంటూ మల్హోత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
View this post on Instagram