రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

New Update
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు

వచ్చే మూడు రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం హైదరాబాద్‌ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Also read : వెస్టిండీస్ క్రికెటర్ కు ఐసీసీ షాక్.. ఆరేళ్ల పాటు నిషేధం

ఈనెల 23-26 వరకు హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షాలు పడతాయి. ఈశాన్య దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్న కిందిస్థాయి గాలుల ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 31.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19.1 డిగ్రీలుగా ఉంది. దీంతో గాలిలో తేమ 41 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇక హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ ఆకాశం మేఘావృతమై ఉంటుందని, కావున పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఏపీలోని ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలకు అవకాశం ఉందంటున్నారు. బుధవారం నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయంటున్నారు. దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులకు అవకాశం ఉందని తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు