Rain Alert: హైదరాబాద్‌ లో భారీ వర్షం...మరో మూడు రోజులు ఉంటుందన్న ఐఎండీ!

రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.వాయువ్య బంగాళాఖతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి. మీ. మధ్య ఉన్న ఆవర్తనం శుక్రవారం కూడా అదే ప్రాంతంలో కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.

New Update
Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..

Hyderabad: జంటనగరాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత రెండు రోజుల నుంచి ఉక్కబోతతో అల్లాడిపోయిన ప్రాణాలకు చల్లటి వాతావరణం ఉపశమనాన్ని ఇచ్చింది. ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, దిల్​సుఖ్​నగర్​, హయత్​నగర్​, అబ్దూల్లాపూర్​మెట్, తిరుమలగిరి, బొల్లారం, జవహర్ నగర్, మారేడుపల్లి, బోయిన్​పల్లి, అల్వాల్, చిలకలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ప్యారడైజ్, బేగంపేట్, తదితర ప్రాంతాలలో గురువారం మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది.

భారీగా కురుస్తున్న వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షం పడుతుండడంతో వాహనదారులు ట్రాఫిక్​లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీల కార్యాలయాలు ముగించుకుని ఉద్యోగులు ఒకేసారి రోడ్డు పైకి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

వెంటనే రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు వాహన రాకపోకలను క్రమబద్దీకరిస్తున్నారు. ట్రాఫిక్​ జామ్‌ కాకుండా ఉండేందుకు ఐటీ కంపెనీల ఉద్యోగులు వారి వారి ప్రయాణ వేళల్లో మార్పులు చేసుకోవాలని పోలీసులు సూచించారు.రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పశ్చిమ మధ్య దానిని అనుకొని వున్న వాయువ్య బంగాళాఖతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 నుండి 5.8 కి. మీ. మధ్య ఉన్న ఆవర్తనం శుక్రవారం కూడా అదే ప్రాంతంలో కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది.

Also read: అనంత్, రాధికాల పెళ్ళి శుభలేఖ ధర తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే..

Advertisment
తాజా కథనాలు