Lucknow Case: దంపతులపై నీళ్లు చల్లిన గ్యాంగ్ అరెస్ట్.. సీఎం యోగి సీరియస్‌ యాక్షన్!

లక్నోలోని గోమతీనగర్‌లో బైక్ పై వెళ్తున్న యువతిపై వర్షం నీరు చల్లిన 19 మంది ఆకాతాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇష్యూలో జాప్యం చేసిన ముగ్గురు పోలీస్ అధికారులపై యోగి సర్కార్ బదిలీ వేటు వేసింది. మరికొందరిని గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

New Update
Lucknow Case: దంపతులపై నీళ్లు చల్లిన గ్యాంగ్ అరెస్ట్.. సీఎం యోగి సీరియస్‌ యాక్షన్!

Lucknow Case: లక్నోలో భర్తతో కలిసి బైక్‌పై వెళ్తున్న యువతిపై నీళ్లు చల్లిన కేసులో 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి.. ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు సూచించారు.

యువతిని అసభ్యకరంగా తాకుతూ..
ఈ మేరకు లక్నోలోని గోమతీనగర్‌ సమీపంలో గత బుధవారం ఈ ఘటన జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై నీరు నిలవడంతో అటుగా వెళ్తున్న వాహనదారులపై కొంతమంది ఆకతాయిలు నీళ్లు చల్లుతూ చీప్ గా బిహేవ్ చేశారు. ఈ క్రమంలోనే ఓ యువ జంట బైక్ పై వెళ్తుండగా వారిపై నీళ్లు చల్లారు. దీంతో బైక్ అదుపుతప్పి అదే నీటిలో పడిపోగా.. యువతి మొత్తం మునిగిపోయింది. అలా పడిపోయినా ఆగని యువకులు యువతిని అసభ్యకరంగా తాకుతూ నీచంగా ప్రవర్తించారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో యోగి సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంది.

ఇది కూడా చదవండి: Paris Olympics: సెమీస్‌కు దూసుకెళ్లిన భారత హాకీ టీమ్.. గ్రేట్ బ్రిటన్‌పై ఘన విజయం!

వెంటనే చర్యలు మొదలుపెట్టిన పోలీసులు 19 మందిని అరెస్ట్ చేసి ఇంకా పలువురిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. మొదట సాధారణ కేసుగా నమోదు చేసిన పోలీసులు సీఎం యోగి జోక్యంతో కేసు అప్‌గ్రేడ్ చేసినట్లు సమాచారం. ఈ ఇష్యూపై ఆలస్యంగా స్పందించిన లక్నో ఈస్ట్ జోన్ డీసీపీ, ఏడీసీపీ, గోమతీనగర్ సీఐలపై బదిలీ వేటు వేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు