Weather Alert: తెలంగాణలో రాబోయే మూడురోజులు వర్షాలు

తెలంగాణలో రాబోయే మూడురోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. శుక్రవారం మెదక్‌ జిల్లాలో వడగాళ్ల వాన కురిసిందని.. వికారాబాద్‌ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు.

New Update
Rains: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తూఫాన్ ఎఫెక్ట్..!

తెలంగాణ నుంచి మధ్య బంగాళఖాతంలో పాంతల వరకు ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయి. దీంతో రాబోయే మూడురోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

Also Read: కఠినంగా శిక్షించండి.. ఆరేళ్ల బాలిక అత్యాచార ఘటనపై సీఎం రేవంత్ సీరియస్!

ఇదిలాఉండగా శుక్రవారం మెదక్‌ జిల్లాలో వడగాళ్ల వాన కురిసిందని అధికారులు తెలిపారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో కూడా పలు చోట్ల భారీ వర్షం కురిసినట్లు పేర్కొన్నారు. శనివారం రాష్ట్రంలోని నిజామాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట,జోగులాంబ గద్వాల తదితర జిల్లాలలతో పాటు.. ఆదివారం నిజామబాద్‌, రాజన్న సిరిసిల్ల,కరీంనగర్‌,పెద్దపల్లి, ములుగు, భదాద్రికొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: ముందుమాట వివాదం.. విద్యాశాఖ అధికారులపై బదిలీ వేటు!

Advertisment
తాజా కథనాలు