Weather Update: తెలంగాణ వాసులకు తీపి కబురు... రెండు రోజుల పాటు వానలు!

తెలంగాణకు త్వరలోనే వర్ష సూచన ఉందని, ఎండల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందనిఐఎండీ వివరించింది. రెండు రోజులు 7, 8 తేదీల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.

New Update
IMD: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ!

Rain Alert in Telangana: వాతావరణశాఖా తెలంగాణ ప్రజలకు ఓ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే వర్ష సూచన ఉందని, ఎండల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందని వివరించింది.  రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని... ఆ తరువాత రెండు రోజులు 7, 8 తేదీల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు.

ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. రాష్ట్రంలో ఈ వేసవిలో మొదటిసారిగా అప్పుడే 45 డిగ్రీల ఉష్ణోగ్రత బుధవారం నమోదైంది. ఖమ్మంతోపాటు భద్రాద్రి కొత్తగూడెంలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు అధికారులు వివరించారు. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎ

ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ చివరి వరకు కొనసాగనున్న నేపథ్యంలో ఈ వేసవిలో ఎండలు ఎకువగానే ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు పైనే నమోదవుతున్నాయి. నిజామాబాద్‌లో 41.2, ఆదిలాబాద్‌లో 41.3, మెదక్‌, రామగుండం, నల్లగొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

పోయిన ఏడాదితో పోలిస్తే ఈ సారి ఎండలు, వడగాడ్పులు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వివరించింది. ముఖ్యంగా మే నెలలో అగ్నిగుండాన్ని తలపించేలా ఎండలు, వడగాడ్పులు బెంబేలిత్తంచనున్నాయి. సాధారణం కంటే 5-8 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని ఐఎండీ అంచనా వేస్తున్నది.

Also Read: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. 8 ప్రత్యేక రైళ్ల పొడిగింపు!

Advertisment
తాజా కథనాలు