Rain Alert in AP: బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. అనంతరం వాయవ్య దిశగా కదిలి 48 గంటల్లో తుపానుగా బలపడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణలో తూర్పు గాలులు వీస్తుడటంతో... వీటి ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మంగళవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇక ఉత్తర కోస్తా, యానంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. అటు రాయలసీమ జిల్లాలకు కూడా మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.
అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట చేతికి వచ్చే సమయం కావడంతో వర్షాసూచనతో అన్నదాతలు భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వందలాది ఎకరాల్లో వరి నేలకొరిగింది. కోతలు కోసి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
Also Read: విద్యార్థులకు శుభవార్త…ఆ బ్యాంకు నుంచి ఉచితంగా రూ.10వేలు…ఇలా ఆప్లై చేస్తే సరి..!!